Elephant: నీళ్లు తాగుతున్న ఏనుగుపై మొసలి దాడి చేసింది.. గజరాజుకు కోపమొచ్చింది.. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా..

|

Aug 08, 2021 | 12:28 PM

భూమిపై అతిపెద్ద జంతువు ఏనుగు.. అత్యంత తెలివైనదిగా ఏనుగును పరిగణిస్తారు. కానీ దాని కోపం కూడా అంతుకు మించి ఉంటుంది.. చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇటీవల దీనికి సంబంధించిన ఒక వీడియో...

Elephant: నీళ్లు తాగుతున్న ఏనుగుపై మొసలి దాడి చేసింది.. గజరాజుకు కోపమొచ్చింది.. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా..
Crocodile Attack
Follow us on

భూమిపై అతిపెద్ద జంతువు ఏనుగు.. అత్యంత తెలివైనదిగా ఏనుగును పరిగణిస్తారు. కానీ దాని కోపం కూడా అంతుకు మించి ఉంటుంది.. చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇటీవల దీనికి సంబంధించిన ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో చాలా వింతలు.. విశేషాలు ఎక్కడ జరుగుతాయంటే ఖచ్చితంగా అడవి జంతువుల మధ్య అని ఎవరైనా చెప్పే సమాదానం. అలాంటివి చూసినప్పుడు జనం థ్రిల్ అవుతారు. ఈ కారణంగానే వారికి సమయం దొరికినప్పుడు అలాంటి వీడియోల కోసం నెటిజన్లు సెర్చ్ చేస్తుంటారు. నిజానికి అడవిలో ఇలాంటి అనేక అరుదైన దృశ్యాలు మనకు కనిపిస్తాయి. వీటిని చూసి ఆశ్చర్యపోతారు. అందుకే అడవిలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అంచనా వేయలేమని చాలా మంది అంటారు. ఈ రోజుల్లో ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తోంది. ఇది ఈ విషయం సరైనదని రుజువు చేస్తుంది.

ఏనుగులు భూమిపై అతిపెద్ద జంతువులు అని మనందరికీ తెలుసు..అయినప్పటికీ అనేకసార్లు వేటగాళ్లు వాటిని వేటాడతారు. ఏనుగులు చాలా తెలివైనవి.. దయగలవిగా పరిగణించబడుతున్నప్పటికీ కోపం వచ్చినప్పుడు వాటిని ఆపడం ఎవరితో కాదని చాలాసార్లు మనం చూశాం. ఇటీవల దీనికి సంబంధించిన వీడియో ఈ రోజు బయటపడింది. ఏనుగులు ఎవరిపైనా అర్థం లేకుండా దాడి చేయవు.

ఈ వీడియోలో మీరు కొన్ని ఏనుగులు సరస్సులో నీరు తాగడానికి వచ్చినట్లు చూడవచ్చు. ఇంతలో, ఒక ఏనుగు సరస్సు లోపలికి వెళ్లి నీరు తాగడానికి తన ట్రంక్‌ను లోపలకు పెట్టగానే  అక్కడి నీటిలో దాక్కున్న మొసలి దానిపై దాడి చేసింది. ఆ తర్వాత ఏనుగుకు కోపమొచ్చింది. తన తొండంతో మొసలిని భూమిలోకి భలంగా నొక్కంది. ఏనుగు ఒత్తిడి కారణంగా మొసలి కలత చెందుతుంది. కానీ ఏనుగు దానిని తన తొండంతో గట్టిగా అదిమి పట్డడంతో మొసలి ఆందోళనకు గురైంది. ఏనుగు నుంచి తప్పించుకునేందుకు మొసలి ప్రయత్నించింది. ఏనుగును నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు మొసలి ఎంత ప్రయత్నించినా ఏనుగు మాత్రం వదలలేదు. దీంతో ఏనుగు మొసలిని తొక్కడం మనకు కనిపిస్తుంది.

వీడియో ఎక్కడి నుండి వచ్చిందో తెలియకపోయినా, ఏనుగు ‘అడవికి నిజమైన రాజు’ అని ఖచ్చితంగా తెలుసు.. మీ సమాచారం కోసం ఈ వీడియోను @hgsdhaliwalips తన ట్విట్టర్ ఖాతాలో సోషల్ మీడియాలో షేర్ చేసారు.

ఇవి కూడా చదవండి: Mysterious Lake of No Return: ఈ సరస్సులోకి దిగినవారు తిరిగి రాలేదు.. ఇండియన్ బెర్ముడాగా పిలిచే ఈ పర్యాటక ప్రాంతం ఎక్కడుందో తెలుసా..

Gupta Nidhulu: ధనవంతులుగా మారండి.. ఆ గుప్తనిధులు మీ సొంతం కావచ్చు.. మాటల మాంత్రికులకు మోత మొగింది..

Neeraj chopra: భళి..భళిరా బల్లెం వీరా.. నీకు మా బంగారు స్వాగతం.. ఆకాశంలో చక్కర్లు కొట్టేందుకు ఇండిగో ఆఫర్..