అయ్యో గజేంద్ర.. ! ఏనుగును ఢీ కొట్టిన రైలు.. చూస్తుండగానే కుప్పకూలిపోయిన గజరాజు

|

Jul 11, 2024 | 7:38 PM

ఈ మార్గంలో ఇలాంటి సంఘటన ఇది మొదటిసారి కాదని అంటున్నారు. ఇంతకుముందు రెండు ఏనుగులు ఇలాంటి పరిస్థితులలోనే చనిపోయాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఏనుగుల పరిధిలో భాగం కాదు. కాబట్టి, అటువంటి ప్రాంతాల్లో ఎన్ని ఏనుగులు ఉన్నాయో తెలుసుకోవడం ఇప్పుడు తప్పనిసరి అంటూ అటవీ శాఖను కోరారు. హృదయాన్ని కదిలించే ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

అయ్యో గజేంద్ర.. ! ఏనుగును ఢీ కొట్టిన రైలు.. చూస్తుండగానే కుప్పకూలిపోయిన గజరాజు
Elephant Died
Follow us on

ప్రస్తుతం ఒక వైరల్ వీడియోపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. మనసుకు హత్తుకునే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ప్రతినిత్యం కనిపిస్తాయి.. జంతువులు చేసే పనులు చాలా సందర్భాల్లో మనల్ని నవ్వించేవిగానే ఉంటాయి. ఒక్కోసారి అవే జంతువులు మనల్ని ఏడిస్తుంటాయి. కొన్ని ఆలోచింపజేస్తుంటాయి. మరికొన్ని సందర్బాల్లో రెండు జంతువుల మధ్య పోరు.. ఎవరు ఎవరిని వేటాడబోతున్నారు అనే థ్రిల్ ఉంటుంది. ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియో మాత్రం ఒక ఏనుగు ప్రమాదానికి గురైన సంఘటన.

ఈ వీడియోలో, రైల్వే ట్రాక్‌పై నడుస్తున్న ఏనుగును ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. దీంతో ఆ ఏనుగు తీవ్రంగా గాయపడింది. నొప్పితో తల్లడిల్లిపోయింది. ఎలాగైనా బతకాలనే ఆశతో అడుగులు వెసేందుకు ప్రయత్నించింది. కానీ, కదలలేక పట్టాలపై కుప్పకూలింది. ఏనుగు రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన రైలు ఏనుగును బలంగా ఢీకొట్టింది. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా సైట్ ‘X’ @SageEarth’ అనే పేజీలో పోస్ట్ చేయబడింది. వీడియో క్యాప్షన్‌లో జూలై 10న సాయంత్రం వేళ ‘కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్’ రైలు ఏనుగును ఢీకొట్టింది. ఈ రైలు పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా- అగర్తల్ మధ్య నడుస్తుందని పేర్కొన్నారు. 1.40 నిమిషాల ఈ క్లిప్ నెటిజన్లను షాక్‌ కు గురిచేసింది.

ఇవి కూడా చదవండి

వీడియోలో ఏనుగు తీవ్రంగా గాయపడిందని స్పష్టం తెలుస్తోంది. దాని వెనుక కాలుకు బలమైన గాయం ఉంది. ఎంత ప్రయత్నించినప్పటికీ అది పైకి లేవలేకపోతుంది. శక్తినంత కూడగట్టుకుని ముందుకు వెళ్లాలని చూసినా ఏనుగు ప్రయత్నం ఫలించలేదు. అమాంతంగా రైలు పట్టాలపై కుప్పకూలి పోయింది. ఆ తర్వాత నాలుగు కాళ్లు కొట్టుకుంటూ ప్రాణాలు వదిలేసింది. ఆ మూగ జీవి ఆర్తనాదం అందరి హృదయాల్ని కదిలించింది. గుండెల్ని బరువెక్కించే ఈ వీడియో వేగంగా వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఈ మార్గంలో ఇలాంటి సంఘటన ఇది మొదటిసారి కాదని అంటున్నారు. ఇంతకుముందు రెండు ఏనుగులు ఇలాంటి పరిస్థితులలోనే చనిపోయాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఏనుగుల పరిధిలో భాగం కాదు. కాబట్టి, అటువంటి ప్రాంతాల్లో ఎన్ని ఏనుగులు ఉన్నాయో తెలుసుకోవడం ఇప్పుడు తప్పనిసరి అంటూ అటవీ శాఖను కోరారు. హృదయాన్ని కదిలించే ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. నాలుగు లక్షలకు పైగా వ్యూస్‌ రాగ, ఈ మూగ జంతువు మృతి చెందడంతో జంతు ప్రేమికులు విషాదంలో మునిగిపోయారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..