Viral Video: ఇది కదా రాజసం..! హిప్పోలతో నిండిన చెరువులో నిర్భయంగా నిలబడ్డ గజరాజు..!

ఏనుగులు శక్తివంతమైన జంతువులు మాత్రమే కాదు, ధైర్యవంతులు కూడా. వాటి ధైర్యం సింహాలకు కూడా చెమటలు పట్టిస్తుంది. ఏనుగు ఎక్కడికి వెళ్ళినా, చుట్టుపక్కల జంతువులు భయాందోళనకు గురవుతాయి. అయితే, కొన్నిసార్లు కొన్ని జంతువులు ఏనుగులపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. వాటి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఏనుగు వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: ఇది కదా రాజసం..! హిప్పోలతో నిండిన చెరువులో నిర్భయంగా నిలబడ్డ గజరాజు..!
Elephant, Hippopotamus

Updated on: Jan 29, 2026 | 12:37 PM

ఏనుగులు శక్తివంతమైన జంతువులు మాత్రమే కాదు, ధైర్యవంతులు కూడా. వాటి ధైర్యం సింహాలకు కూడా చెమటలు పట్టిస్తుంది. ఏనుగు ఎక్కడికి వెళ్ళినా, చుట్టుపక్కల జంతువులు భయాందోళనకు గురవుతాయి. అయితే, కొన్నిసార్లు కొన్ని జంతువులు ఏనుగులపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. వాటి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఏనుగు వీడియో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. ఈ వీడియోలో ఒక ఏనుగు హిప్పోలతో నిండిన చెరువులో నిర్భయంగా నిలబడి ఉంది. హిప్పోల గుంపు దానిపై దాడి చేస్తే ఏమి జరుగుతుందో ఏమాంత్రం భయం లేదనట్లు అనిపిస్తుంది..

ఈ వీడియో అటవీ ప్రాంతంలోని ఒక చెరువులో రికార్డు్ చేసినట్లు ఉంది. ఇక్కడ అనేక హిప్పోలు చెరువులో సేదతీరుతున్నాయి. వాటి మధ్య ఒక ఏనుగు నిలబడి ఉంది. సాధారణంగా, ఏ జంతువు కూడా ఇలా హిప్పోల మధ్యకు వెళ్లే తప్పు చేయదు. ఎందుకంటే హిప్పోలు స్వభావరీత్యా దూకుడుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఒక ఏనుగు నిర్భయంగా నిలబడి ఉంది. ఈ సమయంలో, ఒక హిప్పో.. ఏనుగు వెనుక నుండి మెల్లగా దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ ఏనుగు నిర్భయంగా నిలబడి ఉంది. అది అక్కడే నిలబడి ఆనందిస్తూ ఉంది. కొంతసేపటి తర్వాత, అది నీటి నుండి తనంతట తానుగా బయటకు దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. అన్ని హిప్పోలు ఏనుగు చూస్తూ ఉండిపోయాయి. ఏనుగు ధైర్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.

ఈ వన్యప్రాణుల వీడియోను @Axaxia88 అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్)లో షేర్ చేశారు. దానికి “ఏనుగు వెనుక నుండి కొరుకుతున్న హిప్పోను ఎదుర్కోవడానికి వెనక్కి తిరిగి చూసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అది మెల్లగా దానిని వెనుక నుండి తన్నింది. హిప్పో భయంతో పారిపోయింది.” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఒక నిమిషం 10 సెకన్ల వీడియోను 297,000 కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. 3,000 కంటే ఎక్కువ మంది దీనిని లైక్ చేశారు. వీడియో చేసిన తర్వాత వివిధ రకాలుగా ప్రతిస్పందనలు తెలియజేస్తున్నారు.

ఒక వినియోగదారుడు, “హిప్పో కేవలం ఏనుగును నీటి గుంట నుండి తరిమికొట్టడానికి ప్రయత్నిస్తోంది, ఏనుగుకు హిప్పో కేవలం ఒక ఇబ్బంది మాత్రమే అని తెలుసు, ముప్పు కాదు.” అని రాశారు. మరొక వినియోగదారు, “హిప్పో నీటిలో ఏనుగుకు గణనీయమైన హాని కలిగించి ఉండవచ్చు, కానీ అవి ఒకదానికొకటి గౌరవిస్తాయి, కాబట్టి ఏనుగు వాటిని ఇబ్బంది పెట్టకుండా నెమ్మదిగా దాని స్థానానికి చేరుకుంటుంది.” అని రాశారు.

వీడియోను ఇక్కడ చూడండిః

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..