Viral Video: నాకేదీ అడ్డు.. ఇనుప కంచె మీదుగా చాకచక్యంగా దూకిన ఏనుగు.. వైరల్‌గా మారిన వీడియో..

|

Nov 18, 2021 | 1:40 PM

ఏనుగు చూడడానికి భారీతనంతో కనిపించినా చాలామంది దానిని సాధు జంతువుగానే భావిస్తారు. అయితే అది కొన్ని..

Viral Video: నాకేదీ అడ్డు.. ఇనుప కంచె మీదుగా చాకచక్యంగా దూకిన ఏనుగు.. వైరల్‌గా మారిన వీడియో..
Follow us on

ఏనుగు చూడడానికి భారీతనంతో కనిపించినా చాలామంది దానిని సాధు జంతువుగానే భావిస్తారు. అయితే అది కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఎవరైనా ఏనుగులను ఇబ్బంది పెడితే మాత్రం అంత సులభంగా వదిలిపెట్టవు. బీభత్సం సృష్టిస్తాయి. అంతేకాదు ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు చాకచక్యంగా తప్పించుకుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి మైసూర్‌ సమీపంలోని నాగర్‌ హోళే ఫారెస్ట్‌ రిజర్వ్‌లో చోటుచేసుకుంది. బలంగా ఏర్పాటు చేసిన ఇనుక కంచెను తెలివిగా దాటేందుకు ప్రయత్నించింది. మొదట కొంచెం ఇబ్బందిపడింది. అయితే ఆతర్వాత చాకచక్యంగా ఫెన్సింగ్‌ మీదుగా దూకి అవతలివైపుకు చేరుకుంది.

ఈనెల 16న మైసూరు సమీపంలోని నాగరహోళే ఫారెస్ట్‌ రిజర్వ్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ పుటేజీలో రికార్డయ్యాయని నాగరహోళే టైగర్ రిజర్వ్ డైరెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కాగా ఈ వీడియోని తమిళనాడు ఎన్విరాన్‌మెంట్ క్లైమేట్ చేంజ్ అండ్‌ ఫారెస్ట్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ సుప్రియా సాహు ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు ఈ ఏనుగు తెలివితేటలను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది ఒక్కోసారి అలాంటి కంచెలకు విద్యుత్‌ సరఫరా ఉంటుందని, తద్వారా అవి ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని, కంచెలను తొలగించాలని కోరుతున్నారు.

Mysterious Fish: 555 పదునైన పళ్లు.. ఈ రాకాసి చేప యమ డేంజర్‌.. చూస్తే షాకవుతారు..

Bribery Risk Rankings: లంచాల సమస్య ఏయే దేశాల్లో ఎక్కువ? ఏయే దేశాల్లో తక్కువ? భారత్‌లో పరిస్థితి ఏంటి..

Krithi Shetty Photos: కొంటె చూపులు.. చిలిపి నవ్వులు.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ ‘కృతిశెట్టి’.. (ఫొటోస్)