Elephant chased by huge crowd: ప్రతీ రోజూ సోషల్ మీడియాలో అనేక వైరల్ వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని చూడముచ్చటగా ఉంటే.. మరికొన్ని భయానకంగా.. ఇంకొన్ని బాధను కలిగించే విధంగా ఉంటాయి. ఇక అలాంటి బాధను కలిగించే ఓ వీడియో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో సుధా రామెన్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసి ‘ ఇంతకీ ఈ క్లిప్‌లో ఎవరు జంతువు.?” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఇందులో ఓ ఏనుగు రద్దీగా ఉండే రోడ్డుపై పరిగెత్తుతుంటే.. దానిని గుంపులు గుంపులుగా మనుషులు కర్రలతో తరుముతూ కనిపిస్తారు. ఈ వీడియోను అక్కడ ఉన్న లోకల్ వ్యక్తులు రికార్డు చేయగా.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై లుక్కేయండి.
No words!! Wondering who is the animal here ? pic.twitter.com/LAcY276HdX
— Sudha Ramen IFS ?? (@SudhaRamenIFS) March 17, 2021
సుధా రామెన్ ఈ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ”జంతువులకు వాటి పరిమితులు తెలియవు. మనుషుల మాదిరిగా అవగాహన కలిగి ఉండవు. ఏనుగుల విషయానికి వస్తే, సీన్ మొత్తం వేరు. అడవులు అంతరించిపోవడం లేదా ఆహారం కోసం అప్పుడప్పుడూ జనావాసాల్లోకి వస్తుంటాయి. అందుకే అటవీ ప్రాంతాల సమీపంలో నివసించే ప్రజలు ఎప్పుడూ భయపడకుండా ఉండాలి. దాని వల్ల మీకు హని కలగవచ్చునని.. మీరు ఎలా అనుకుంటున్నారో.? అదే విధంగా మనుషుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు జంతువులూ ప్రయత్నిస్తాయి. కొన్నిసార్లు వాటిని భయబ్రాంతులకు గురి చేస్తే తిరిగబడతాయి కూడా అందుకే ఇక్కడ అవగాహన అనేది చాలా కీలకం” అని సుధా రామెన్ పేర్కొన్నారు. కాగా ఆమె ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. అనేక మంది రీ-ట్వీట్స్ చేయడంతో పాటు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది నుంచి అయితే భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.
చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!
భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!
తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!