Viral News: ముంబై లోకల్ ట్రైన్‌లో చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ వృద్ధురాలు స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహాయాన్ని నిరాకరించింది. దీనిపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. NGO వ్యవస్థాపకుడు హర్తీరత్ సింగ్ అహ్లువాలియా తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయం వెల్లడించారు. ముంబై లోకల్ ట్రైన్‌లో సదరు వృద్ధురాలు తనకు ఎదురైనట్టుగా తెలిపారు.. ఆమెను చూసిన వెంటనే తనకు సహాయం చేయాలనుకున్నానని చెప్పాడు. అందుకోసం తనకు కొంత డబ్బును సాయంగా అందించారట. అందుకు ఆ వృద్ధురాలు నిరారకరించింది. తనకు డబ్బు సహాయం వద్దని చెప్పిందట. బదులుగా వారు ఆమె విక్రయిస్తున్న అన్ని చాక్లెట్లను కొనుగోలు చేశారట. తాజాగా ముంబై లోకల్ ట్రైన్‌లో వృద్ధురాలు చాక్లెట్లు అమ్ముతున్న ఈ వీడియో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో సూట్ ధరించిన ఓ మహిళ చాక్లెట్లు, ఇతర ఆహార పదార్థాల పెట్టెతో ప్రయాణీకుల వద్దకు వెళ్తుంది. అయితే, ఆమెకు NGO వ్యవస్థాపకుడు హర్తీరత్ సింగ్ అహ్లూవాలియా ఆమెకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. కానీ, ఆమె డబ్బు సహాయాన్ని నిరాకరించింది. బదులుగా, వారు ఆమె విక్రయిస్తున్న అన్ని చాక్లెట్లను కొనుగోలు చేశారు.
After much effort when we finally found her today, to our sheer surprise, Dadi-ji declined any monetary help. We then bought all the chocolates that she was selling. pic.twitter.com/SB3zW5QrtA
— Harteerath Singh Ahluwalia (@HarteerathSingh) September 7, 2022
వాస్తవానికి మోనా ఎఫ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోను ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ (డిసిడబ్ల్యు) చీఫ్ స్వాతి మలివాల్ మళ్లీ షేర్ చేశారు. ఎందుకంటే అలాంటి వ్యక్తుల నుండి ప్రతి ఒక్కరూ వస్తువులను కొనుగోలు చేయాలని ఆమె కోరారు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ వృద్ధురాలిని ఎంతగానో అభినందిస్తున్నారు. ఆత్మాభిమానం, ఆత్మ విశ్వాసం అంటే ఇదే మరీ..! నెటిజన్లు తీవ్రమైన కామెంట్లు చేస్తున్నారు. హ్యాట్సాఫ్ అవ్వ అంటూ పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి