Watch: ఏం పెద్దమనిషివయ్యా..! ఎక్కడా చోటు లేన్నట్టు గొడుగు అడ్డుపెట్టుకుని మరీ రైలు పట్టాలపై ఇలాగేనా..?

|

Aug 27, 2024 | 6:53 AM

సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ మొత్తం ఘటనపై నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై కొంతమంది చాలా ఆశ్చర్యపోతుండగా, మరికొందరు ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Watch: ఏం పెద్దమనిషివయ్యా..! ఎక్కడా చోటు లేన్నట్టు గొడుగు అడ్డుపెట్టుకుని మరీ రైలు పట్టాలపై ఇలాగేనా..?
Man Sleeps On Railway Track
Follow us on

రైల్వే ట్రాక్‌పై విన్యాసాలు చేసే చాలా మందిని మీరు చూసి ఉంటారు. కొంతమంది స్టేషన్‌లోని రైల్వే ట్రాక్‌లపై రీళ్లు చేస్తుంటారు. అలా ప్రయత్నించిన వారిలో కొందరు రైలు ఢీకొన్ని ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో కొంత మందిని పోలీసులు అరెస్ట్‌ చేసిన సంఘటనలు కూడా సోషల్ మీడియా ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా, ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌పై ఎంచక్కా గొడుగు అడ్డంగా పెట్టుకుని హాయిగా నిద్రపోతున్నాడు. అదే ట్రాక్‌పై ఒక రైలు వేగంగా దూసుకొచ్చింది. పట్టాలపై నిద్రపోతున్న ఆ వ్యక్తిని గమనించిన లోకో పైలట్‌ వెంటనే రైలును నిలిపివేశాడు. ఎంతటా హారన్‌ కొట్టినా ఆ వ్యక్తి కదలకపోవడంతో లోకో పైలట్‌ కిందకు దిగి అతడి వద్దకు వెళ్లి నిద్ర లేపాడు. ఆ తర్వాత రైలు ముందుకు కదిలింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది. కాగా, వీడియో క్లిప్‌ మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో రైల్వే ట్రాక్‌పై ఓ వృద్ధుడు గొడుగు పట్టుకుని హాయిగా నిద్రిస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. పై నుంచి చిరు జల్లులు పడుతుండగా ఆ వ్యక్తి ఎంచక్కా గొడుగు వేసుకుని రైల్వే ట్రాక్‌పై హాయిగా కునుకుతీస్తున్నాడు. రైలు పట్టాలపై తల పెట్టి మధ్యలో పడుకున్నాడు.అదృష్టవశాత్తూ, ట్రాక్‌పై నిద్రిస్తున్న వ్యక్తిని గమనించిన లోకో పైలట్ సకాలంలో బ్రేకులు వేశాడు. చాలా సేపటి వరకు హారన్‌ మోగించాడు.. అతడు నిద్రలోంచి లేస్తాడని భావించాడు లోకోపైలట్‌. కానీ, అతడు ఏ మాత్రం కదలకుండా అలాగే నిద్రపోతున్నాడు. దీంతో ఇంజన్‌ నుంచి కిందకు దిగి ఆ వ్యక్తి వద్దకు చేరుకున్నాడు. మంచి నిద్రలో ఉన్న అతడ్ని తట్టి లేపాడు. రైలు పట్టాల నుంచి పక్కకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ రైలు అక్కడి నుంచి కదిలి వెళ్లింది.

ఈ వీడియో చూడండి..

సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ మొత్తం ఘటనపై నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై కొంతమంది చాలా ఆశ్చర్యపోతుండగా, మరికొందరు వ్యక్తి ప్రాణాలను కాపాడిన లోకో పైలట్‌ను కూడా ప్రశంసిస్తున్నారు. ఆ వ్యక్తి చనిపోయే ఉద్దేశంతో రైలు పట్టాలపై పడుకున్నట్లుగా లేదని కొందరు అభిప్రాయపడ్డారు. అతడ్ని పిచ్చివాడిగా మరికొందరు అభివర్ణించారు. మద్యం మత్తులో రైలు పట్టాలపై నిద్రించి ఉంటాడని మరి కొందరు మండిపడ్డారు. ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..