అక్కడున్న వారందరూ ఆ వ్యక్తి చనిపోయాడని అనుకున్నారు. కానీ ట్రైన్ పైలెట్ తీసుకున్న చొరవతో విలువైన ప్రాణం దక్కింది. మహారాష్ట్రలోని థానే జిల్లా కళ్యాణ్ రైల్వే స్టేషన్ నుంచి పట్టాలు దాటుతున్న వృద్ధుడిని వేగంగా వస్తున్న ట్రైన్ దాదాపుగా ఢీకొట్టినంత పని చేసింది.. కాకపోతే లోకో పైలెట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి బ్రేకులు వేయడంతో ప్రాణాలు దక్కాయి.
ఈ సంఘటన జూలై 18వ తేదీ మధ్యాహ్నం 12.45 గంటలకు జరిగింది. వివరాల ప్రకారం ఆ సమయంలో కల్యాణ్ స్టేషన్ నుంచి ముంబై-వారణాసి మధ్య నడిచే ట్రైన్ అప్పుడే స్టార్ట్ అయింది. అయితే ఇదే సమయంలో హరిశంకర్ అనే 70 ఏళ్ల వృద్ధుడు రైలు ట్రాక్‌ను దాటుతున్న సమయంలో కింద పడిపోయాడు. ఇది గమనించిన చీఫ్ పర్మెనెంట్ వే ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్.. వెంటనే రైలు ఆపమని లోకోపైలట్లకు సిగ్నల్ ఇచ్చారు. దీంతో వారు వెంటనే అత్యవసర బ్రేకులు వేసి ట్రైన్‌ను ఆపారు.
అయితే అప్పటికే హరిశంకర్ రైలు ముందుభాగం కింద ఇరుక్కున్నాడు. వెంటనే రైలు దిగిన లోకోపైలట్ ఎస్కే ప్రధాన్, అసిస్టెంట్ పైలట్ రవిశంకర్.. రైలు ముందుభాగంలో ఇరుక్కున్న బాధితుడిని బయటకు తీశారు. కాగా, అత్యవసర బ్రేకులు వేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ఇద్దరు లోకో పైలట్లకు, CPWIకి ఒక్కొక్కరికి 2వేల రూపాయల చొప్పున నగదు బహుమతిని సెంట్రల్ రైల్వేస్ జనరల్ మేనేజర్ అలోక్ కన్సాల్ ప్రకటించారు.
Also Read
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చెట్టుపై 11 అడుగుల భారీ పాము.. షాకైన స్థానికులు..
కొంచెం థ్రిల్.. మరికొంచెం ఆత్రుత.. ఈ ఫోటోలో పాము దాగుంది.. దాన్ని కనిపెట్టండి చూద్దాం.!
37 నిమిషాల బ్యాటింగ్.. 453 స్ట్రైక్ రేట్‌తో తుఫాన్ ఇన్నింగ్స్.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.!
ఈ ఫోటోలో చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. టాలీవుడ్‌ను ఏలుతోంది.. ఈమెవరో గుర్తుపట్టారా!
Alert Loco Pilots of Mumbai-Varanasi train (02193) applied emergency brakes immediately after starting the train from Kalyan station & saved the life of a senior citizen who was crossing tracks.
Please do not cross tracks in an unauthorized manner. It can be fatal. pic.twitter.com/hHCtn9bVIu
— Ministry of Railways (@RailMinIndia) July 18, 2021