సైబీరియాలో బయటపడ్డ 18 వేల ఏళ్ల నాటి కుక్కపిల్ల!

సైబీరియాలో ఇటీవలే ఓ విచిత్రమైన విషయం వెలుగులోకి వచ్చింది. 18 వేల ఏళ్ల క్రితం చనిపోయినట్టుగా భావిస్తున్న ఒక కుక్క పిల్ల మృతదేహాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఈ జీవి చనిపోయినప్పుడు రెండు నెలల కన్నా తక్కువ వయస్సు కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కుక్క పిల్ల ఏ విధంగా చనిపోయిందో దానికి సంబంధించిన కారణాలు ఇంకా శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. కుక్కపిల్ల శరీరం, మందపాటి జుట్టు, మూతి, మీసాలు వెంట్రుకలు కూడా పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్నందువల్ల […]

సైబీరియాలో బయటపడ్డ 18 వేల ఏళ్ల నాటి కుక్కపిల్ల!

Edited By:

Updated on: Nov 29, 2019 | 4:25 AM

సైబీరియాలో ఇటీవలే ఓ విచిత్రమైన విషయం వెలుగులోకి వచ్చింది. 18 వేల ఏళ్ల క్రితం చనిపోయినట్టుగా భావిస్తున్న ఒక కుక్క పిల్ల మృతదేహాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఈ జీవి చనిపోయినప్పుడు రెండు నెలల కన్నా తక్కువ వయస్సు కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కుక్క పిల్ల ఏ విధంగా చనిపోయిందో దానికి సంబంధించిన కారణాలు ఇంకా శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. కుక్కపిల్ల శరీరం, మందపాటి జుట్టు, మూతి, మీసాలు వెంట్రుకలు కూడా పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్నందువల్ల అవన్నీ సజీవంగా ఉన్నప్పటి లాగానే ఉన్నాయని శాస్త్రవేత్తలు వివరించారు.

ఒక నివేదిక ప్రకారం స్వీడన్ శాస్త్రవేత్తలు ఈ జంతువు వయస్సు 18,000 సంవత్సరాలు ఉన్నట్లు ధృవీకరించారు, అయితే, మేము దాని జన్యువును 2X కవరేజీకి క్రమం చేసాము, అది తోడేలు లేదా కుక్క అన్నది మేము ఇప్పుడే చెప్పలేము అని తెలిపారు. ఆ కుక్కపిల్లకి డోగోర్ అని పేరు పెట్టారు, స్థానిక యాకుట్ మాండలికంలో స్నేహితుడు అని అర్థం.

[svt-event date=”29/11/2019,1:56AM” class=”svt-cd-green” ]