
మన దేశంలో చాలా చోట్ల రోడ్లు నిర్మించగానే కూలిపోవడం, గుంతలమయంగా మారటం మనం చూస్తుంటాం. కానీ చైనా రోడ్లు.? అవి ఏళ్ల తరబడి ఒక్క పగులు కూడా లేకుండా మెరుస్తాయి! రహస్యం ఏమిటి అంటే.. గుడ్లు! అవును, మీరు చదివింది నిజమే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఇదే చెబుతున్నాయి. చైనీస్ ఇంజనీర్లు గుడ్డు పెంకులను మెత్తని పొడిగా రుబ్బి కాంక్రీట్ మిశ్రమంలో కలుపుతారని, దీనివల్ల రోడ్లు సూపర్ స్ట్రాంగ్‌గా ఉంటాయని పేర్కొంటున్నాయి. ఈ వార్త ఆశ్చర్యకరమైనది మాత్రమే కాదు, పర్యావరణ దృక్కోణం నుండి కూడా విప్లవాత్మకమైనది. కానీ, ఇది కేవలం వైరల్ వార్తనా..? లేదంటే వాస్తవమా? పూర్తి డిటెల్స్ ఇక్కడ చూద్దాం..
#EggRoadChina అనేది Instagram, TikTok వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండ్ అవుతోంది. గుడ్లను రోడ్లపైకి విసిరి ఆపై వాటిపై రోడ్డును నిర్మిస్తున్నట్లు చూపించే వీడియో ఇక్కడ వైరల్ అవుతోంది. వారి అధ్యయనాల ప్రకారం.. గుడ్డు పెంకుల్లో కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. ఇది సిమెంట్‌ను బలపరుస్తుంది. పగుళ్లను నివారిస్తుంది. ఈ చైనీస్ ఆవిష్కరణ కొత్తదేమీ కాదు. బీజింగ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు గుడ్డు పెంకు పొడి కాంక్రీటు బలాన్ని అనేక రెట్లు పెంచుతుందని చూపించే అధ్యయనాన్ని ప్రచురించారు. ఈ పదార్థం చౌకగా ఉండటమే కాకుండా వ్యర్థాలను కూడా తగ్గిస్తుంది. ఈ వీడియోకు లక్షలాది వ్యూస్ వచ్చాయి.
వీడియో ఇక్కడ చూడండి..
వ్యర్థాలను సరిగ్గా ఉపయోగించడం:
చైనా ప్రతి సంవత్సరం బిలియన్ల కొద్దీ గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. వాటి పెంకులు ఒకప్పుడు వ్యర్థాలుగా మారేవి. ఇప్పుడు, వీటిని రోడ్లు నిర్మించడానికి రీసైకిల్ చేస్తున్నారు. ఉదాహరణకు, షాంఘై-పుడాంగ్ ఎక్స్‌ప్రెస్‌వే 50 కిలోమీటర్ల విభాగం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించబడింది. ఇది నిర్వహణ లేకుండానే ఉంది. ఇది ఆ రోడ్డు జీవితాన్ని 30 నుండి 50 సంవత్సరాలకు పెంచిందని చైనా ప్రభుత్వ నివేదికలు సూచిస్తున్నాయి. పర్యావరణ మంత్రిత్వ శాఖ దీనికి గ్రీన్ కన్స్ట్రక్షన్ అవార్డును ప్రదానం చేసింది.
IIT ఢిల్లీలో ప్రొఫెసర్ డాక్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ, గుడ్డు పొడి వంటి ఆవిష్కరణలను భారతదేశంలో కూడా అమలు చేయవచ్చు అన్నారు.. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద గుడ్డు ఉత్పత్తిదారు, ఏటా 1 మిలియన్ టన్నుల గుడ్డు పెంకు వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ గుడ్లను రీసైక్లింగ్ చేయడం వల్ల రోడ్లు బలోపేతం అవుతాయి. కాలుష్యం తగ్గుతుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…