దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా.. నెటిజన్లు ప్రశంసల వర్షం..

|

Apr 20, 2024 | 7:19 PM

ఈ షాప్ లో జ్యూస్ ను సైకిల్ ఉపయోగించి తయారు చేస్తారు. అంతేకాదు ప్లాస్టిక్ సీసాలు,  ప్లాస్టిక్ గ్లాసులు,  ప్లాస్టిక్ స్ట్రాస్ లను కూడా ఉపయోగించరు. అందుకు బదులుగా పండ్ల డొప్పలను కప్పులుగా మలచి అందులోనే జ్యూస్ ను కస్టమర్స్ కు అందిస్తున్నారు. ఈ పర్యావరణ అనుకూల జ్యూస్ సెంటర్ బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉంది.

దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా.. నెటిజన్లు ప్రశంసల వర్షం..
Eco Friendly Juice Shop
Follow us on

రోజురోజుకీ వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి దీంతో కాలుష్యం పెరిగిపోతోంది. మొక్కలు నరికివేత, ఫ్రిడ్జ్, ఏసీ వంటి ఎలక్రికల్ వస్తువుల వినియోగం ఇలా అనేక రకాల కారణాలతో ఎండలు మండిస్తున్నాయి.. కాలం కానీ కాలంలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలామంది ప్రకృతి ప్రేమికులు సేవ్ ఎర్త్.. అంటూ నినదిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఎకో ఫ్రెండ్లీ జ్యూస్ షాప్ ‘ఈట్ రాజా’ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తోంది.

ఈ షాప్ లో జ్యూస్ ను సైకిల్ ఉపయోగించి తయారు చేస్తారు. అంతేకాదు ప్లాస్టిక్ సీసాలు,  ప్లాస్టిక్ గ్లాసులు,  ప్లాస్టిక్ స్ట్రాస్ లను కూడా ఉపయోగించరు. అందుకు బదులుగా పండ్ల డొప్పలను కప్పులుగా మలచి అందులోనే జ్యూస్ ను కస్టమర్స్ కు అందిస్తున్నారు. ఈ పర్యావరణ అనుకూల జ్యూస్ సెంటర్ బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ ఎకో ఫ్రెండ్లీ జ్యూస్ షాప్ వీడియో @ontheground.with.sai ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలోని అని ప్లాట్ ఫాన్స్ లోనూ వైరల్ అవుతోంది. వీడియోలో సైకిల్ వెనుక క్యారేజ్ కు జ్యూస్  జార్ అమర్చబడి ఉంది. ఆ జార్ లో జ్యూస్ తయారీకి కావాలిన పదార్ధాలను వేసి సైకిల్ ను తొక్కాల్సి ఉంటుంది. అప్పుడు జ్యూస్ తయారు అవుతుంది. ఇది మాత్రమే కాదు పండ్ల గుజ్జుని తీసిన డొప్పలను కప్పులుగా మలచి తాము రెడీ చేసిన జ్యూస్ ని పోసి సర్వ్ చేస్తున్నారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

ఈ వీడియో ఏప్రిల్ 17న షేర్ చేశారు. కేవలం రెండు రోజుల్లో దాదాపు నాలుగు లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది ఈ వీడియో. అంతేకాదు 31 వేల మందికి పైగా నెటిజన్లు తమ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులోని ఉన్న పరిస్థితుల దృష్ట్యా..  పర్యావరణహిత జ్యూస్ సెంటర్ వీడియో సర్వత్రా వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..