ట్రాఫిక్ జామ్ తో విసిగిన వ్యక్తి.. భుజం మీద బైక్ ను తీసుకుని వెళ్తున్న వీడియో వైరల్

|

Jun 28, 2024 | 12:43 PM

బెంగుళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో అతిపెద్ద సమస్య ట్రాఫిక్ జామ్. ఎక్కడికి వెళ్లాలన్నా ఓ రెండు గంటల ముందే బయలుదేరాలి. ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుంటే పడే బాధ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంత కోపం వచ్చినా గంటల తరబడి నిరీక్షిస్తూ ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకూ ఎదురు చూడాలి. అంతకంటే ఏమీ చేయలేం. ఇప్పుడు ట్రాఫిక్‌ జామ్‌తో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు బైక్‌ను భుజాలపై వేసుకుని మోసుకుని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్రాఫిక్ జామ్ తో విసిగిన వ్యక్తి.. భుజం మీద బైక్ ను తీసుకుని వెళ్తున్న వీడియో వైరల్
Video Viral
Follow us on

రోజు రోజుకీ పెరుగుతున్న జనాభా..పెరుగుతున్న వాహనాల వినియోగంతో రోడ్డుమీద ప్రయాణం చేయాలంటే ఒక యుద్ధం చేయాలి అనే ఫీలింగ్ ను ఇస్తుంది. ట్రాఫిక్ జామ్ సమస్య మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ట్రాఫిక్ లో చిక్కుకున్న వారి ఇబ్బందులు గురించి ఇప్పటికే అనేక వార్తలు వింటూనే ఉన్నాం. ఇటీవల ఓ యువతి అయితే ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోవడానికి త్వరగా ఎయిర్ పోర్ట్ కు వెళ్లడానికి ఉబార్ క్యాబ్ కు బదులుగా ఏకంగా హెలికాప్టర్ ని బుక్ చేసుకుని హ్యాపీగా ప్రయాణించింది. ఈ వార్తా ఇంకా వైరల్ అవుతూనే ఉంది. అయితే తాజాగా ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న ఓ యువకుడు తన బైక్ ను ఏకంగా భుజం మీద పెట్టుకుని మోసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన మన దేశంలో అతి పెద్ద నగరం బెంగుళూరులో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

బెంగుళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో అతిపెద్ద సమస్య ట్రాఫిక్ జామ్. ఎక్కడికి వెళ్లాలన్నా ఓ రెండు గంటల ముందే బయలుదేరాలి. ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుంటే పడే బాధ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంత కోపం వచ్చినా గంటల తరబడి నిరీక్షిస్తూ ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకూ ఎదురు చూడాలి. అంతకంటే ఏమీ చేయలేం. ఇప్పుడు ట్రాఫిక్‌ జామ్‌తో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు బైక్‌ను భుజాలపై వేసుకుని మోసుకుని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వైరల్‌గా మారిన వీడియోలో రోడ్డుమీద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్ మధ్యలో ఒక యువకుడు తన బైక్‌ను ఎత్తుకుని వెళ్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఈ సీన్ ఎవరికైనా బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని భుజం మీద మోసుకుని వెళ్ళిన సీన్ ను గుర్తు చేస్తుంది. చాలా దూరం ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకున్న వాహనదారులు ఈ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బైక్‌ను ఎత్తుకెళ్తున్న దృశ్యాన్ని ఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్‌లో బంధించగా ప్రస్తుతం ఆ వీడియో ఓ రేంజ్ లో హల్‌చల్ చేస్తోంది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

ఈ వీడియో @basit_ki_memes అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. జూన్ 18న షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 3.5 మిలియన్లకు పైగా అంటే 30 లక్షలకు పైగా వ్యూస్ రాగా రెండు లక్షల మందికి పైగా నెటిజన్లు వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది ట్రాఫిక్ జమ్ సమయంలో తమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..