
చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు శాఖలోనే ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఒక మహిళా డీఎస్పీ పోలీసులకే మచ్చ తెచ్చే పని చేసింది. తన స్నేహితురాలి ఇంట్లోనే రెండు లక్షల రూపాయల నగదు, మొబైల్ ఫోన్‌ను దొంగిలించింది. సీసీటీవీ ఫుటేజీలో ఆ మహిళా అధికారి కరెన్సీ నోట్లను చేతిలో పట్టుకుని వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భోపాల్‌లోని జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే బాధితురాలు డీఎస్పీ కల్పనా రఘువంశీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను మొబైల్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్లినప్పుడు డీఎస్పీ చోరీకి పాల్పడిందని ఆరోపించింది. డీఎస్పీ కల్పనా రఘువంశీ.. తన బ్యాగులోని రూ.2 లక్షల నగదు, మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో తెలిపింది. ఈ దొంగతనం జరిగిన దృశ్యాలు ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఈ ఫుటేజీలో మహిళా డీఎస్పీ ఇంట్లోకి వచ్చి వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నిందితురాలైన డీఎస్పీ చేతిలో నోట్ల కట్ట కూడా ఆ ఫుటేజీలో రికార్డయ్యింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జహంగీరాబాద్ పోలీసులు డీఎస్పీ కల్పనా రఘువంశీపై దొంగతనం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బాధితురాలి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కానీ నగదు ఇంకా దొరకలేదు. డీఎస్పీ పరారీలో ఉన్నారని, ఆమె కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ADCP బిట్టు శర్మ తెలిపారు. త్వరలోనే ఆమెను అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన ఉన్నత అధికారి ఇలాంటి నేరానికి పాల్పడటం పోలీసులను షాక్‌కు గురిచేసింది.
सिवनी में एक महिला डीएसपी पर डकैती की धारा लगी तो भोपाल कैसे पीछे रहता यहां एक महिला डीएसपी पर चोरी का मामला दर्ज हुआ है अपने ही दोस्त के घर से 2 लाख रु और मोबाइल चोरी का आरोप मैडम सीसीटीवी में कैद हैं पुलिस गिरफ्त से बाहर @GargiRawat @alok_pandey @manishndtv pic.twitter.com/RIwIKN7avf
— Anurag Dwary (@Anurag_Dwary) October 29, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి