
మద్యానికి బానిసైన వారికి మద్యం దొరకలేదంటే పిచ్చెక్కిపోతారు. కొంతమంది దాని కోసం తమ ఇల్లు, భార్య, పిల్లలను కూడా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటారు. కానీ, మద్యానికి మాత్రం దూరంగా ఉండలేరు. అలాంటి ఒక మద్యపాన బానిస మద్యం పొందడానికి ఏం చేసాడో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మూసివేసిన దుకాణం నుండి మద్యం బాటిల్ తీయడానికి ప్రయత్నిస్తుండగా, అతని మెడ ఇనుప గ్రిల్‌లో ఇరుక్కుపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియో @jist.news అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుండి పోస్ట్ చేయబడింది. మద్యం బాటిల్ తీయడానికి ప్రయత్నించినప్పుడు ఒక వ్యక్తి తల మూసివేసిన దుకాణం గ్రిల్‌లో ఎలా ఇరుక్కుపోయిందో వీడియోలో కనిపిస్తుంది. మద్యం దొరక్కపోవటంతో తల్లడిల్లిపోయిన అతడు ఇలా ఇబ్బందులను తెచ్చుకున్నారు. అతడు మందుబాటిల్ కోసం ఇనుప గ్రిల్స్ మద్యలో తలదూర్చాడు. ఆ తర్వాత అతడు పడ్డ అవస్థలు, బయటకు రావడానికి అతడు ప్రయత్నిస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. అక్కడే ఉన్న ఇతర వ్యక్తులు అతని తల బయటకు వచ్చేలా గ్రిల్‌ను పట్టుకుని లాగడానికి ప్రయత్నిస్తున్నారు. చివరికి, అక్కడ ఉన్న వ్యక్తుల సహాయంతో అతని తల గ్రిల్ నుండి బయటకు వచ్చింది.
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ వీడియో మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది ఇది నిజమైన మద్యం మత్తు అని అంటున్నారు. కొందరు గ్రిల్‌లో ఇరుక్కుపోయిన తర్వాత అతను బాటిల్‌ను సాధించాడా అని మరి కొందరు ప్రశ్నించారు. బాటిల్ పగలకుండా చూసుకుంటూ అతన్ని బయటకు తీయండి అంటూ ఇంకొందరు కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..