Viral Video: అయ్యో పాపం.. అంకుల్‌కి ఎన్ని కష్టాలొచ్చాయ్..! చేతిలో సెల్‌ఫోన్‌ జేబులో పెట్టుకోవటానికి తాగిన వ్యక్తి తిప్పలు చూస్తే..

|

Jun 01, 2023 | 4:20 PM

అలాగే, చాలా మంది వినియోగదారులు తమ తమ బిన్నమైన కామెంట్లను తెలియజేస్తున్నారు. పెళ్లిళ్లు, పార్టీల్లో ఇలాంటి సీన్లు మామూలే అని మరి కొందరంటే.. డిన్నర్ తర్వాత ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారని ఇం కొందరు రాశారు. ఇక చాలా మంది వినియోగదారులు వీడియోను చూసిన తర్వాత నవ్వు ఆపుకోలేకపోతన్నామంటూ కామెంట్‌ రాశారు.

Viral Video: అయ్యో పాపం.. అంకుల్‌కి ఎన్ని కష్టాలొచ్చాయ్..!  చేతిలో సెల్‌ఫోన్‌ జేబులో పెట్టుకోవటానికి తాగిన వ్యక్తి తిప్పలు చూస్తే..
Drunk Man
Follow us on

ఫుటుగా తాగిన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తుంటారో మనం తరచుగా చూస్తూనే ఉంటాం. తాగుడు అలవాటు ఉన్న వాళ్లు కొంతమంది.. మద్యం తాగాక చప్పున ఇంటికెళ్లి పడుకుంటారు. మరికొందరు నానా హంగామా సృష్టిస్తుంటారు. పీకల దాకా తాగి అల్లరి చేసే వారిని ఎంతో మందిని మనం చూస్తుంటాం. ఇక కొందరు మందుబాబులైతే చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. తాగిన మత్తులో ఏం చేస్తున్నారో వారికి తెలియదు. ఆ తెలియని మత్తులో వారు చేసే పనులు చూసే వారిని కడుపుబ్బా నవ్వుకునేలా చేస్తాయి. ఇక మందుబాబులకు అది దుఃఖమైనా సరే, సంతోషమైనా సరే.. కొంతమందికి తాగడానికి ఒక సాకు అవసరం. అయితే, కొందరు ఫ్రీబీలు దొరికినప్పుడల్లా తెగ తాగేస్తుంటారు. ఎంతలా అంటే..చేతిలో ఉన్న మొబైల్‌ ఫోన్ తీసి జేబులో కూడా పెట్టుకోలేనంతగా తాగేస్తుంటారు. ఇలాంటి ఇక్కడ వైరల్‌గా మారింది.

ఓ ఈవెంట్ సందర్భంగా మద్యం తాగిన అలాంటి వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ 27 సెకన్ల నిడివిగల వీడియోలో సదరు వ్యక్తి ఒక చేతిలో మొబైల్‌ను పట్టుకోగా, మరో చేతిలో ప్లేట్ నిండా ఆహారం పెట్టుకున్నాడు. ఇక చేతిలోని మొబైల్‌ని జేబులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అది జేబుకు బదులు నేలమీద పడిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే..

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియోని ట్విట్టర్ యూజర్ @GaurangBhardwa1 మే 31న పోస్ట్ చేసారు. దీనికి క్యాప్షన్‌లో ఇలా వ్రాశారు.. తాగే ముందు.. నేను ఎంత తాగినా నాకు కిక్కు ఎక్కడకుండా ఉంటే బెట్టర్‌..అని. ఈ క్లిప్‌కు 1 లక్షకు పైగా వ్యూస్‌ వచ్చాయి. వేల సంఖ్యలో లైక్‌లు కూడా వచ్చాయి. అలాగే, చాలా మంది వినియోగదారులు తమ తమ బిన్నమైన కామెంట్లను తెలియజేస్తున్నారు. పెళ్లిళ్లు, పార్టీల్లో ఇలాంటి సీన్లు మామూలే అని మరి కొందరంటే.. డిన్నర్ తర్వాత ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారని ఇం కొందరు రాశారు. ఇక చాలా మంది వినియోగదారులు వీడియోను చూసిన తర్వాత నవ్వు ఆపుకోలేకపోతన్నామంటూ కామెంట్‌ రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..