
బస్సు డ్రైవర్ పాఠశాల విద్యార్థుల ప్రాణాలను పణంగా పెడుతున్నట్లు చూపించే ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ నిర్లక్ష్యంపై ఇంటర్నెట్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. బస్సు డ్రైవర్ పాఠశాల విద్యార్థులను బస్సు పైకప్పుపై కూర్చోబెట్టి నిర్లక్ష్యంగా నడుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వినియోగదారులు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు.
గుంతలు పడిన రోడ్డుపై బస్సు వేగంగా దూసుకుపోతోంది. బస్సులో నిండుగా విద్యార్థులు కూర్చొని ఉన్నారు. చూసేవారు మాత్రం పిల్లలకు ఏమవుతుందో అని భయంతో వణికిపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆశ్చర్యకరంగా, అనేక మంది పాఠశాల విద్యార్థులు బస్సు వెనుక నుండి వేలాడుతూ, గణనీయమైన సంఖ్యలో పైకప్పుపై కూర్చొని ఉన్నారు. అయినప్పటికీ, బస్సు డ్రైవర్ ఆందోళన చెందకుండా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. ఈ వీడియో డ్రైవర్ తీవ్ర నిర్లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్కలు తలెత్తుతున్నాయి.
బస్సు డ్రైవర్ పిల్లల భద్రతను పరిగణనలోకి తీసుకోలేదని, ట్రాఫిక్ నియమాలను పాటించలేదని వీడియో స్పష్టం చూపిస్తుంది. ఈ విధంగా పిల్లలను బస్సులోకి ఎక్కించడం పెద్ద ప్రమాదానికి ఆహ్వానించడంతో సమానం. బస్సు వెనుక డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులు కూడా అదే భావాలను వ్యక్తం చేస్తున్నారు. వారి కార్ల నుండి డ్రైవర్ నిర్లక్ష్యాన్ని రికార్డ్ చేశారు. వీడియో వైరల్ అయిన తర్వాత, జనం దానిపై తీవ్రంగా స్పందించారు.
ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయడం జరిగింది. మిలియన్ల కొద్దీ వీవ్స్ వచ్చాయి. అనేక లైక్‌లను సంపాదించింది. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారుడు “ఇది ప్రతి గ్రామం కథ” అని రాశారు. మరొక వినియోగదారుడు “బాధ్యుల జేబులు నిండిపోయాయి, ఆపై వారిని ఆపలేరు” అని రాశారు. మరొక వినియోగదారుడు “RTO ఎక్కడ నిద్రపోతోంది?” అని ప్రశ్నించారు.
వీడియో ఇక్కడ చూడండిః
बच्चों की जान से खिलवाड़…. pic.twitter.com/2GiGJDXPbC
— आजाद भारत का आजाद नागरिक (@AnathNagrik) December 23, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..