Dog Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. అయితే.. కొన్ని జంతువుల వీడియోలు చూడటానికి ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు మంచి సందేశాన్ని ఇస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక కుక్క కుళాయి నీరు తాగడానికి ప్రయత్నిస్తుంది. స్వయంగా ట్యాప్ తిప్పిన శునకం.. కుళాయి ఆ తర్వాత నీటిని తాగుతుంది. ఈ వీడియోలో కుక్క ఇచ్చిన సందేశం నెటిజన్ల మనసును హత్తుకుంటోంది. అందుకే జంతువులను చూసి చాలా నేర్చుకోవచ్చంటూ పేర్కొంటున్నారు.
వైరల్ వీడియోలో ఓ శునకం పిల్లతో కలిసి వాటర్ ట్యాప్ దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత పిల్ల పక్కకు వెళ్లిపోతుంది. శునకం వచ్చి రాగానే స్వయంగా వాటర్ ట్యాప్ తిప్పి నీటిని తాగుతుంది. మళ్లీ బంద్ చేసి.. కాస్త గాలి పీల్చుకొని మళ్లీ ఓపెన్ చేసి నీరు తాగుతుంది. ఆ తర్వాత బంద్ చేస్తోంది. ఇలా శునకం నీటిని ఎంత పొదుపుగా ఉపయోగిస్తే.. అంత మంచిదంటూ అందరికీ సందేశం ఇచ్చింది. దీంతోపాటు శునకం తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
వైరల్ వీడియో..
बूँद-बूँद कीमती है…
डॉगी को समझ आ गया, हम इंसान कब समझेंगे? pic.twitter.com/wMoY7QGAnS— Dipanshu Kabra (@ipskabra) July 7, 2022
ఈ వీడియోను ఐపిఎస్ అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్‌లో పంచుకున్నారు. “ప్రతి నీటి చుక్క విలువైనదే.. ఈ విషయం కుక్కకి కూడా అర్థమైంది.. మనుషులకు ఎప్పుడు అర్థం అవుతుంది..? అంటూ రాశారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ తెలివైన కుక్కను చూసి ముగ్ధులమయ్యాంటూ పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ ఈ శునకం నుంచి నేర్చుకోవాలని.. నీటిని ఎలా సంరక్షించాలో తెలుసుకోవాలంటూ పేర్కొంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి