Viral Video: ఆడుకో నాన్న.. పసిపాపపై ప్రేమ కురిపించిన శునకం.. అమేజింగ్ అంటున్న నెటిజన్స్..

|

Jun 02, 2022 | 5:33 PM

చాలామంది పెంపుడు జంతువులుగా కుక్కలను ఇష్టంతో పెంచుకుంటుంటారు. అవి పెద్దలతోపాటు పిల్లలతో కూడా చాలా సరదాగా ఉంటాయి.

Viral Video: ఆడుకో నాన్న.. పసిపాపపై ప్రేమ కురిపించిన శునకం.. అమేజింగ్ అంటున్న నెటిజన్స్..
Viral Video
Follow us on

Dog – Child Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పలు రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. ఓ శునకం.. పసిపాపను ఆడిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసి అందరూ ఫిదా అవుతున్నారు. వాస్తవానికి శునకాలు విశ్వాసానికి ప్రతీకగా ఉంటాయి. అందుకే.. చాలామంది పెంపుడు జంతువులుగా కుక్కలను ఇష్టంతో పెంచుకుంటుంటారు. అవి పెద్దలతోపాటు పిల్లలతో కూడా చాలా సరదాగా ఉంటాయి. పసిబిడ్డలను సైతం కుక్కలు స్నేహితులుగా చూసుకుంటాయి. అయితే.. కుక్కలు తమ యజమానులు, పిల్లలతో ఆడుకునే వీడియోలు మనం చాలానే చూసుంటాం.. ఇవి చూడటానికి చూడముచ్చటగా ఉంటాయి. తాజాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో అందర్ని ఆకట్టుకుంటోంది.

వైరల్ వీడియోలో.. కాలీ అనే గోల్డెన్ రిట్రీవర్ అనే కుక్క.. బిడ్డతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తుండటాన్ని చూడవచ్చు. దీనిలో కుక్క కాలితో.. బొమ్మను జరిపి పాప చేతికి అందించడానికి ప్రయత్నిస్తుంది. అయితే.. నెలల శిశువే కావడంతో కుక్క ప్రయత్నానికి స్పందించదు. అయితే.. వీడియో అందరిని తెగ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో చూడండి..

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ డాగ్స్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేయగా.. ఇప్పటివరకు 7.61 లక్షలకు పైగా వీక్షించారు. దీంతోపాటు వేలాది మంది లైక్ చేసి.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అందుకే కుక్కలను పెంచుకోవాలని.. ఇవి తమ ప్రాణాలను సైతం అడ్డేస్తాయని పేర్కొంటున్నారు. అయితే.. ఈ క్యూట్ వీడియో కెనడాలోని అంటారియోకు చెందినదని పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..