Viral Video: సాగర తీరంలో అద్భుత దృశ్యం.. ఇసుక సైతం కనిపించనంతలా పరుగులు తీస్తున్న..

Viral Video: ఒడిశాలోని ఋషికుల్య బీచ్‌లో ఒక్కసారిగా వందలాది తాబేళ్లు బుడి బుడి అడుగులతో సముద్రంలోకి వెళుతున్నాయి. ఆ తాబేళ్లన్నీ అప్పుడే గుడ్డులో నుంచి బయటకు వచ్చినవి. దీంతో ఆ సముద్ర తీరమంతా ఇసుక కనిపించనంతలా తాబేళ్లతో మారిపోయింది. ప్రస్తుతం...

Viral Video: సాగర తీరంలో అద్భుత దృశ్యం.. ఇసుక సైతం కనిపించనంతలా పరుగులు తీస్తున్న..
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 02, 2022 | 5:44 PM

Viral Video: ఒడిశాలోని ఋషికుల్య బీచ్‌లో ఒక్కసారిగా వందలాది తాబేళ్లు బుడి బుడి అడుగులతో సముద్రంలోకి వెళుతున్నాయి. ఆ తాబేళ్లన్నీ అప్పుడే గుడ్డులో నుంచి బయటకు వచ్చినవి. దీంతో ఆ సముద్ర తీరమంతా ఇసుక కనిపించనంతలా తాబేళ్లతో మారిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒకేసారి వందల సంఖ్యలో తాబేళ్లు సముద్రంలోకి వెళుతున్న దృశ్యం నెటిజన్లు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ అన్ని తాబేళ్లు ఒకేసారి ఎక్కడికి వెళుతున్నాయి.? అనేగా మీ సందేహం. అయితే తాబేళ్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి తెలుసుకోవాల్సిందే.

సాధారణంగా ఏ జీవి మనుగడకైనా ప్రత్యుత్పత్తి వ్యవస్థే మూలం. ఇందుకోసం ఒక్కో జీవి ఒక్కో విధానాన్ని అవలంబిస్తుంది. వీటిలో తాబేళ్లు పునరుత్పత్తి వ్యవస్థ చాలా విచిత్రంగా ఉంటుంది. ముందుగా తల్లి తాబేళ్లు పెద్ద ఎత్తున సముద్ర తీరానికి చేరుకుంటాయి. ఒక్కో తాబేలు సముద్ర తీరంలో పదుల సంఖ్యలో గుడ్లను పెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్తాయి. గుడ్లు పరిపక్వత దశకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా తాబేళ్లు బయటకు వచ్చి సముద్రంలోకి వెళ్తాయి.

ఈ ప్రక్రియ వర్షకాలం ప్రారంభ సమయంలో జరుగుతుంది. తాజాగా జూన్‌ 1న ఒడిశాలోని బుషికుల్య బీచ్‌లో తాబేళ్లు సముద్రంలోకి వెళుతోన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో పోస్ట్‌ చేసిన కేవలం కొన్ని క్షణాల్లోనే వేల వ్యూస్‌తో దూసుకుపోతోంది. నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే