అమెరికాలోని కాన్సాస్ లో డిజ్జీ డీన్ అనే హార్స్ మన్ కి తన పెంపుడు కుక్క అంటే ప్రాణం.. దానికి తోడుగా ఓ గుర్రాన్ని కూడా పెంచుకుంటున్నాడు. కాన్సాస్ లో విపరీతంగా మంచు కురుస్తున్న వేళ.. అతగాడికో సరదా ఐడియా తట్టింది. మంచు కురిసే ప్రాంతంలో సులభంగా వెళ్లగలిగే స్లెడ్ కి ఓ తాడు కట్టి.. దాని చివర గ్రీన్ కలర్ ట్రే ని బిగించాడు. ఆ ట్రేలో తన ముద్దుల కుక్కను కూర్చోబెట్టి.. ఐసీ ల్యాండ్ లో గుర్రమెక్కి స్వారీ చేస్తూ ఆ తాడును లాక్కుపోయాడు. డిజ్జీ గారి ఈ వైనం చూసి అంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. నల్లని ఆ డాగ్ కూడా ఎంచక్కా ఆ వెరైటీ స్లెడ్ ప్రయాణాన్ని కూల్ గా ఎంజాయ్ చేసింది. స్లెడ్ మీద అది కదిలితే ఒట్టు ! ఈ నెల 19 న కాన్సాస్ లో జరిగిన మనోడి ఈ వింత ‘ ప్రదర్శన ‘ వీడియోకెక్కి వావ్ అనిపించింది.