Viral Video: అదృష్టమంటే దీనిదే.. ఈ వీడియో చూస్తే ‘ఛీ.. కుక్క బతుకు’ అని ఇక అనరు.. ఎందుకంటే..

Viral Video: సాధారణంగా ఎవరినైనా తిట్టడానికి 'ఛీ ఇదేం బతుకురా కుక్ర బతుకు' అని తిడుతుంటాం. కుక్కలకు ఎలాంటి మనోభావాలు ఉండవు, వాటికి హక్కులు లేవని, అవి ఎదురించలేవనే ధైర్యంతోనే...

Viral Video: అదృష్టమంటే దీనిదే.. ఈ వీడియో చూస్తే ఛీ.. కుక్క బతుకు అని ఇక అనరు.. ఎందుకంటే..
Viral Video

Updated on: Dec 08, 2021 | 11:57 AM

Viral Video: సాధారణంగా ఎవరినైనా తిట్టడానికి ‘ఛీ ఇదేం బతుకురా కుక్క బతుకు’ అని తిడుతుంటాం. కుక్కలకు ఎలాంటి మనోభావాలు ఉండవు, వాటికి హక్కులు లేవని, అవి ఎదురించలేవనే ధైర్యంతోనే మనిషి ఇలా మాట్లాడుతాడు. అయితే కొన్ని కుక్కల రాజభోగాలు చూస్తే మన అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు. మనుషుల కంటే లగ్జరీగా, ఎంజాయ్‌గా గడుపుతుంటాయి. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నట్లు శునకాల యజమానులు వాటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. శునకాలను ఇంటిలో సభ్యులిగా భావిస్తూ వాటికి తమతో సమానమైన గౌరవాన్ని, అవసరాలను తీరుస్తుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ పెంపుడు శునకాలకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ శునకానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే Chipheregirl అనే TikTok అకౌంట్‌ నుంచి పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ శునకం యజమాని దానికోసం ప్రత్యేకంగా ఓ ఇంటినే నిర్మించారు. ఇందులో శునకం కోసం ఓ టీవీ, పర్సనల్‌ బెడ్‌, ఫ్రిడ్జ్‌తో పాటు సకల సౌకర్యాలను దానికి అందుబాటులో ఉంచారు. క్రిస్మస్‌ దగ్గర పడుతోన్న నేపథ్యంలో ఇంటిని కూడా చూడ ముచ్చటగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ‘ఆహా.. ఈ కుక్కకు ఎంత అదృష్టం’, ‘మీ శునకానికి రూమ్‌మేట్ అవసరం ఉంటే చెప్పండి’, అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా ‘ఛీ కుక్క బతుకు అంటారా.?’ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి మరి.

Also Read: Telangana: ఇంటి పన్ను చెల్లించిన వారికి బంపరాఫర్‌ ప్రకటించిన గ్రామ సర్పంచ్‌.. భలే ఐడియా గురూ..

Corona Virus: నో డౌట్.. మూడో ముప్పు కన్ఫర్మ్ !! లైవ్ వీడియో

Telangana: ఇంటి పన్ను చెల్లించిన వారికి బంపరాఫర్‌ ప్రకటించిన గ్రామ సర్పంచ్‌.. భలే ఐడియా గురూ..

Follow Us