Trending Video: ఇంటర్నెట్‌లో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పించే ఫన్నీ వీడియోలు ఉంటే.. ఇంకొన్ని షాక్‌కు గురిచేస్తాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యపరుస్తాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూసి మాత్రం జనాలు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే అందులో ఉన్న జీవి ఏంటి అనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. బీహార్(Bihar)లోని ముజఫర్‌పూర్ జిల్లా(Muzaffarpur district) నుంచి ఈ వీడియో క్లిప్ రికార్డ్ అయినట్లు తెలుస్తుంది. ఓ స్టోర్‌లో ఈ వింత జీవి కెమెరాకు చిక్కింది. అది వేగంగా సెల్ఫ్‌పైకి ఎక్కుతుంది. అది కుక్క అని కొందరు అంటుంటే.. కాదు ముంగిస అని మరికొందరు అంటున్నారు. ఇంకొందరి అది అటవీ జాతికి చెందిన పిల్లిని అని చెబుతున్నారు. అది కుక్క మాదిరి హైట్, సైజ్ ఉంది. కానీ ఫేస్ అయితే ముంగిసలా ఉంది. ఈ వింత జీవి గురించి సమాచారం అందగానే.. దాన్ని చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. కాగా ఈ క్లిప్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ అది ఏ జీవి అనేది మీకైనా తెలుసా..? తెలిస్తే అందరికీ తెలియజేయండి.
बिहार के मुजफ्फरपुर जिले में एक विचित्र जानवर देखा गया है। इस जानवर को देखने के लिए काफी भीड़ इकट्ठी हो गई। #Bihar @Live_Hindustan pic.twitter.com/JB4AgEXiIc
— Hindustan UP-Bihar (@HindustanUPBH) August 24, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..