Dog Suicide Bridge: భూప్రపంచంలో అంతుచిక్కని ఎన్నో రహస్యాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. టెక్నాలజీ పీక్స్ లెవల్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిని చేధించలేని పరిస్థితి ఉంటుంది. అందుకే వాటిని అలా చూస్తూ పోవడమే తప్ప చేసేదేం ఉండదు. ఇలాంటి ఆసక్తికరమైన మిస్టరీ గురించే ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. స్కాట్లాండ్‌లోని వెస్ట్ డన్బర్టన్‌షైర్‌లో గల ఓ బ్రిడ్జి కథ ఇప్పటికీ చర్చనీయాంశమే. ఎందుకంటే.. సాధారణంగా మనుషులు బిల్డింగ్‌లపై నుంచి దూకో, బ్రిడ్జిలపై నుంచి దూకో ఆత్మహత్య చేసుకుంటారు. కానీ జంతువులు ఆత్మహత్య చేసుకోవడం ఎప్పుడైనా చూశారా? అందులోనూ శునకాలు ఆత్మహత్య చేసుకోవడం గురించి విన్నారు. అయితే, ఇప్పుడు వింటారు.. చూస్తారు కూడా. ఆ బ్రిడ్జిపై 1960 సంవత్సరం నుంచి ఇప్పటికీ కుక్కలు ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నాయి.. మరి ఆ బ్రిడ్జ్ ఏంది? ఆత్మహత్యలేంది? అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వివరాల్లోకెళితే.. స్కాట్లాండ్… వెస్ట్ డన్బర్టన్‌షైర్‌లోని… ఓవర్టన్ హౌస్‌కి వెళ్లే రోడ్డుపై ఓవెర్టన్ బ్రిడ్జి ఉంది. ఇది చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. లాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ హెచ్.ఇ. మిల్నర్ ఈ వంతెనను డిజైన్ చేయగా..1895లో దీని నిర్మాణం పూర్తయ్యింది. అయితే, 1960 నుంచి ఈ వంతెనపై నుంచి వెళ్తున్న కుక్కలు కిందపడి చనిపోతున్నాయి. నేటికి కూడా కుక్కలు ఇలాగే చనిపోతున్నాయి. ఇలా 50కి పైగా కుక్కలు బ్రిడ్జి పై నుంచి పడి చనిపోగా.. 600కు పైగా కుక్కలు గాయాలతో బయటపడ్డాయి. అయితే కుక్కలు ఎందుకు అలా పడిపోతున్నాయో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కడం లేదు. కొందరైతే ఆ కుక్కలు ఆత్మహత్య చేసుకుంటున్నాయంటూ చెబుతున్నారు. విచిత్రంగా వందలాది కుక్కలు మాత్రమే బ్రిడ్జి పై నుంచి పడిపోవడం ఏంటనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ భావనను పరిశోధకులు ఖండించారు. ఫూలీష్‌గా మాట్లాడొద్దంటూ హితవుచెబుతున్నారు. కాగా, ఈ కుక్కల మృతికి సంబంధించిన మిస్టరీని చేధించేందుకు జంతు హింస నియంత్రిత సొసైటీ సభ్యులు రంగంలోకి దిగారు. మిస్టరీని ఛేదించి చూపిస్తామంటూ సవాల్ విసిరారు. తీరా ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించాక ఏమీ తేల్చలేక చేతులెత్తేశారు. పరిశోధకులు కూడా ఈ మిస్టరీని చేధించకపోవడంతో.. పుకార్లుకు మరింత రెక్కలు వచ్చినట్లయ్యింది. దెయ్యాల కథలు అల్లడం ప్రారంభించారు. దెయ్యం వల్లే ఈ కుక్కలు ఇలా చనిపోతున్నాయని చెప్పుకొస్తున్నారు. అయితే, ఈ పుకార్లను హేతువాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి ఈ మిస్టరీ ఎప్పుడు వీడుతుందో కాలానికే తెలియాలి.
Also read:
Big News Big Debate: బద్వేలు ప్రీమియర్ లీగ్ – BPL వార్‌లో పేలుతోన్న మాటల తూటాలు
Kid Safety: బైక్‌పై పిల్లలను తీసుకెళ్తున్నారా.. నియమాలు తెలియకపోతే బుక్కైనట్లే..
Hebah Patel: ఏంజెల్ లా మెరుస్తున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)