Viral Video: మనుషుల్లాగే ఫోజులు ఇస్తోన్న కుక్క.. వీడియో చిత్రీకరిస్తూ డ్యాన్స్‌లు.. ఫన్నీ వీడియో వైరల్

జంతువులు చాలా తెలివైనవి.. అందులో కుక్క పిల్లలు మరింత ఎక్కువ. వీటికి మనుషులతో కాస్తా చనువు కూడా ఎక్కువే. చాలా మంది ఇళ్ళలో

Viral Video: మనుషుల్లాగే ఫోజులు ఇస్తోన్న కుక్క.. వీడియో చిత్రీకరిస్తూ డ్యాన్స్‌లు.. ఫన్నీ వీడియో వైరల్
Dog Dancing Funny Video

Updated on: Jun 16, 2021 | 7:58 PM

జంతువులు చాలా తెలివైనవి.. అందులో కుక్క పిల్లలు మరింత ఎక్కువ. వీటికి మనుషులతో కాస్తా చనువు కూడా ఎక్కువే. చాలా మంది ఇళ్ళలో కుక్క పిల్లలు అనేక మంది పెంచుకుంటుంటారు. అయితే కుక్క పిల్లలు, పిల్లులు, కోతులు చేసే ఫన్నీ చెష్టలకు సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో అవి చేసే పనులకు కొన్నిసార్లు ఆశ్చర్యం కలగడంతోపాటు.. నవ్వులు కలిగిస్తుంటాయి. తాజాగా ఓ కుక్క పిల్ల డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియో.. ఓ కుక్క పిల్ల.. సెల్ఫీ వీడియో వస్తువుకు అమర్చి ఉన్న స్మార్ట్ ఫోన్ పై ముందుగా తన నోటితో టచ్ చేసింది. ఆ తర్వాత ఆ స్మార్ట్ ఫోన్ ముందు గంతులేస్తూ దగ్గరి వరకు వచ్చింది. అలాగే సెల్ఫీ ఫోటోలు తీసుకుంటున్నట్లుగా రకరకాల ఫోజులు ఇస్తూ.. రౌండ్ తిరుగుతూ గంతులేసింది. తమ కుక్క పిల్ల చేస్తున్న చేష్టలను ఆ యాజమాని వీడియో తీసి ఇన్‏స్టా‏గ్రామ్‏లో అప్‏లోడ్ చేశారు. “మా కుక్క పిల్ల గురించి చాలా గర్వంగా ఉంది. సొంతంగా వీడియోలు, ఫోటోలు ఎలా తీయాలో ట్రిక్స్ నేర్పిస్తుంది. ఈ వీడియో చూసి మీరు నవ్వుకుంటారు అనుకుంటున్నాను ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: Healthy Tips: కోవిడ్ 19, ఎలర్జీ మధ్య తేడాలివే.? కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవే..

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయంటే.!

Backpain Relief Tips: వెన్నునొప్పితో ఇబ్బంది పడేవారు ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలట.. సూచిస్తున్న నిపుణులు..

Health Benefits of Laughing: నవ్వంటే బ్రెయిన్‌కు లవ్‌.. లాఫింగ్ వ‌ల్ల‌ క‌లిగే అద్భుత‌మైన‌ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఇవే