కొన్ని రోజుల క్రితం వచ్చిన 777 చార్లీ చిత్రం జంతుప్రేమికులందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం ఒక కుక్క, దాని యజమానికి సంబంధించిన కథ. ఈ సినిమాలో హృదయాన్ని కదిలించే సన్నివేశం ఉంది. ఇందులో యజమాని అనారోగ్యానికి గురైనప్పుడు, అతన్ని ఆసుపత్రికి తీసుకువెళతారు. ఈ సమయంలో కుక్క అంబులెన్స్ వెనుక పరుగెత్తి ఆసుపత్రికి చేరుకుంటుంది. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ కుక్క తన యజమానిని తీసుకువెళ్తున్న అంబులెన్స్ వెనుక పరుగెత్తుతూ కనిపించింది.
జంతువులలో కుక్కలు అత్యంత విశ్వసనీయమైనవి అంటారు. ఈ విధేయతకు రుజువు ఈ వైరల్ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అంబులెన్స్ రోగిని తీసుకువెళ్తుండగా, ఈ అంబులెన్స్ వెనుక ఓ కుక్క కూడా పరిగెత్తింది. వెనుక నుంచి వస్తు్న్న ఎవరో ఇదంతా వీడియో తీశారు. ఈ కుక్కను చూసి అంబులెన్స్ డ్రైవర్ ఆగిపోవడం వీడియోలో కనిపిస్తుంది. దీని తరువాత అతను అంబులెన్స్ తలుపు తెరుస్తాడు. ఆ కుక్క లోపలికి వెళుతుంది.
ఈ వీడియో చూడండి..
A dog was running after the ambulance that was carrying their owner. When the EMS realized it, he was let in. ❤️ pic.twitter.com/Tn2pniK6GW
— TaraBull (@TaraBull808) September 12, 2024
ఈ వీడియో Xలో Tara Bull అనే వినియోగదారు షేర్ చేశారు. ఈ వీడియో క్యాప్షన్‌లో ఒక కుక్క తన యజమానిని తీసుకువెళుతున్న అంబులెన్స్ వెనుక పరిగెడుతోందని..ఈ విషయం తెలుసుకున్న అంబులెన్స్ డ్రైవర్ ఆ కుక్కను తన యజమాని వద్దకు తీసుకెళ్లాడు.
ఈ 27 సెకన్ల వీడియో క్లిప్‌కు 4 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. దీనిపై వేల సంఖ్యలో నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ డ్రైవర్ చాలా మంచివాడని ఆ మూగజీవి ఆవేదన అర్థం చేసుకున్నాడని అంటున్నారు. ఈ కుక్క విధేయత మందు మనుషులమైన మనం అర్హులం కాదని ఒకరు రాశారు. ఇలా చాలా మంది చాలా రకాల అభిప్రాయాలను తెలియజేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..