Dog barking on chickens: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. ఈ వీడియోలు కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే.. ఈ వీడియో నెటిజన్లను తెగనవ్విస్తోంది. సాధారణంగా ఇంట్లో ఉన్న కుక్క కూడా సింహమే అనే సామెతను వింటూనే ఉంటాం. విశ్వాసానికి ప్రతీక అయిన కుక్కలను చాలామంది పెంచుకుంటుంటారు. అయితే.. కొన్ని కుక్కలు ఇంట్లోకి ఎవర్నీ అడుగుపెట్టనీవు. పక్కన యజమానులుంటేనే ఇంట్లోకి అనుమతిస్తాయి. అయితే.. సాధారణంగా మనుషుల స్వాభావం బయటపడినట్లే జంతువుల స్వాభావం కూడా బయటపడుతుందని, దూరంగా ఉన్నప్పుడు ఒకలా.. దగ్గరగా ఉన్నప్పుడు మరోలా ఉంటుందని చాలామంది పేర్కొంటుంటారు. అలానే ఈ వీడియో కూడా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక పెంపుడు కుక్క దూరం నుంచి కోళ్లను చూసి మొరుస్తుంది. కానీ అది కోళ్ల దగ్గరికి వెళ్ళిన వెంటనే.. భయంతో తోక ముడుచుకుంటుంది. అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. వీడియోలో మీరు ఒక ఇనుప రెయిలింగ్ గోడను చూడవచ్చు. దానికి ఓ వైపు కుక్క ఉంటుంది.. మరోవైపు రెండు కోళ్లు ఉంటాయి. కుక్క ఇటువైపు నుంచి ఆ కోళ్లను చూసి.. మీద పడి కరిచేటట్లు అరుస్తుంది. ఈ క్రమంలో.. ఒక అమ్మాయి కుక్కను ఎత్తుకుని.. కోళ్లు ఉన్న వైపున వదిలిపెడుతుంది. అయితే.. అప్పటివరకు మొరిగిన కుక్క ఒక్కసారిగా తోక ముడుచుకుంటుంది. ఏడుపు ముఖం పెట్టి అక్కడి నుంచి తీసుకెళ్లండి అనేలా.. రేయిలింగ్‌ను పట్టుకొని ప్రాథేయపడుతుంది.
వైరల్ వీడియో..
కాగా.. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఇలాంటి వీడియో మీరు ఇంతకు ముందెన్నడూ చూసి ఉండరు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫన్నీ వీడియోను asupan.reels.hewani అనే యూజర్ షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 3 మిలియన్లకు పైగామంది వీక్షించారు. 1 లక్ష 33 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసి.. పలు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడూ అతి పనికిరాదంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: