
టైటిల్ చూసి మోసపోవద్దు. కంటెంట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. డాక్టర్లు చేసిన ఈ పని వైద్యచరిత్రలోనే మొదటిది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకోగా.. ఆ వ్యక్తి(డెంగ్) ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. 30 సంవత్సరాల క్రితం తాగిన మత్తులో ఒక వ్యక్తి సిగరెట్ లైటర్‌ను మింగడంతో.. వైద్యులు కండోమ్‌ను ఉపయోగించి అతని కడుపులోంచి సిగరెట్ లైటర్‌ను బయటకు తీశారు.
ఈ లైటర్ మూడు దశాబ్దాల క్రితం సదరు రోగి మింగేయగా.. అతడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. అప్పుడప్పుడు వచ్చే కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందుతున్నాడు ఆ వ్యక్తి. నెల రోజుల క్రితం వరకు అతనికి నిరంతర కడుపు ఉబ్బరం, నొప్పి వస్తుండటంతో.. టెస్టుల కోసం ఆస్పత్రికి వచ్చాడు. గ్యాస్ట్రోస్కోపీ సమయంలో వైద్యులు అతని కడుపులో లోతుగా నల్లటి వస్తువు ఉన్నట్టు గమనించారు. చైనాలోని చెంగ్డు అనే ప్రాంతం నుంచి వచ్చిన ఆ రోగి ‘1991 లేదా 92 సంవత్సరంలో, స్నేహితుడితో కలిసి మద్యం సేవిస్తూ.. ఓ పందెం కాశానని.. ఆ సమయంలో తాను ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. ఇక డెంగ్ భార్య, కుమారుడికి ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు.
వైద్యులు మొదట ఫోర్సెప్స్‌తో లైటర్‌ను తొలగించడానికి ప్రయత్నించారు. కానీ ఆ వస్తువు బయట ఉపరితలం చాలా సెన్సిటివ్‌గా ఉండటంతో.. కండోమ్‌ను వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫోర్సెప్స్ ద్వారా కండోమ్‌ను రోగి కడుపులోకి నెమ్మదిగా చొప్పించి.. నోటి ద్వారా ఆ లైటర్‌ను జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ ప్రక్రియ పూర్తీ కావడానికి 20 నిమిషాలు పట్టింది. ఇక తొలగించిన లైటర్ పొడవు దాదాపుగా 7 సెంటీమీటర్లు ఉందని.. ఆ వస్తువు తుప్పు పట్టినట్టు అవుతోందని డాక్టర్లు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి