Viral: ప్రైవేట్‌ పార్టులో నొప్పంటూ ఆస్పత్రికొచ్చిన మహిళ.. ఎక్స్‌రే తీసి కంగుతిన్న డాక్టర్లు.!

|

Feb 19, 2024 | 2:15 PM

కొన్నేళ్లుగా ఓ మహిళ కడుపునొప్పి, అసౌకర్యం, వికారం, వాంతులతో బాధపడుతూ ఉండేది. ఈ నొప్పులన్నీ తగ్గేందుకు ఎన్నో మందులు వాడింది. అయితేనేం ఏమాత్రం లాభం లేకపోయింది. ఈ సమస్యలన్నీ కూడా ముందుకన్నా ఎక్కువగా పెరుగుతూపోయాయి. దీంతో ఆమె స్థానికంగా ఉన్న ఓ డాక్టర్ దగ్గరకు చికిత్స నిమిత్తం వెళ్లింది.

Viral: ప్రైవేట్‌ పార్టులో నొప్పంటూ ఆస్పత్రికొచ్చిన మహిళ.. ఎక్స్‌రే తీసి కంగుతిన్న డాక్టర్లు.!
X Ray Representative Image
Follow us on

కొన్నేళ్లుగా ఓ మహిళ కడుపునొప్పి, అసౌకర్యం, వికారం, వాంతులతో బాధపడుతూ ఉండేది. ఈ నొప్పులన్నీ తగ్గేందుకు ఎన్నో మందులు వాడింది. అయితేనేం ఏమాత్రం లాభం లేకపోయింది. ఈ సమస్యలన్నీ కూడా ముందుకన్నా ఎక్కువగా పెరుగుతూపోయాయి. దీంతో ఆమె స్థానికంగా ఉన్న ఓ డాక్టర్ దగ్గరకు చికిత్స నిమిత్తం వెళ్లింది. అక్కడి డాక్టర్లు ఆమెకు ఎక్స్‌రే తీసి చూడగా.. దెబ్బకు కంగుతిన్నారు. ఇంతకీ అసలేం జరిగింది.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన 27 ఏళ్ల మహిళ గత కొద్దికాలంగా జ్వరం, కడుపునొప్పి, వాంతులు, ఒణుకు, పొత్తి కడుపు నొప్పి, వికారం, ఆకలి వేయకపోవడం లాంటి సమస్యలతో బాధపడుతున్న ఆమె.. స్థానికంగా ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్లింది. పరీక్షలు చేసిన వైద్యులు.. ఆమెకు ఎక్స్‌రే తీయగా పొత్తి కడుపులో బత్తాయి సైజులో యోని రాయి ఉన్నట్టు గుర్తించారు. అనంతరం డాక్టర్లు మూడు గంటల పాటు లేజర్ ట్రీట్‌మెంట్ చేసి.. ఆ రాయిని తొలగించారు. మూత్రపిండాల్లో రాళ్లు వచ్చిన మాదిరిగానే ఈ యోని రాళ్లు కూడా మూత్రంలో వృద్ది చెందుతాయని వైద్యులు వెల్లడించారు. ఇది చాలా అరుదైన పరిస్థితి అని.. గతంలో చాలాసార్లు యోని రాళ్లను తప్పుగా నిర్ధారించారని డాక్టర్లు చెప్పుకొచ్చారు. సదరు మహిళ యోని రాయి పరిమాణంలో పెద్దది కావడంతో.. అది ఆమె మూత్రాశయాన్ని గట్టిగా నొక్కిందని.. అందుకే ఇబ్బందులు ఎదుర్కుందని స్పష్టం చేశారు.