మాములుగా వేరే కంట్రీస్‌కు వెళ్లాలంటే వీసా, పాస్‌పోర్ట్ వంటివి అవసరమవుతాయి. దేశం పరిధిలో ఎక్కడికి వెళ్లాలన్నా పాస్‌పోర్టులు, వీసాల వంటివి నీడ్ ఉండదు. అయితే మన దేశంలోని ఈ రైల్వే ష్టేషన్ మాత్రం అందుకు మినహాయింపు. భౌగోళికంగా ఆ ప్రాంతం మనదేశంలోనే స్టేషన్ ఉన్నా.. మన పౌరులు కూడా అక్కడి వెళ్లాలంటే పాస్‌పోర్టుతోపాటు పాకిస్థాన్ వీసా కూడా తప్పనిసరి. ఆ ప్లేస్ ఏంటి అంటే.. అట్టారీ రైల్వే స్టేషన్. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ జిల్లాలో ఈ అట్టారి రైల్వే స్టేషన్ ఉంది.
ఈ అట్టారీ రైల్వే స్టేషన్ భారత్, పాకిస్థాన్ దేశాల బోర్డర్‌లో ఉంది ఈ రైల్వే స్టేషన్‌ను అట్టారి శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్ అని కూడా సంభోదిస్తారు. అయితే ఇది భారత్, పాక్ బోర్డర్‌లో ఉన్న అత్యంత సున్నితమైన ప్రదేశం. ఇరు దేశాల సరిహద్దుల్లోని అట్టారి – వాఘా బోర్డర్ ఏరియాలో ఈ రైల్వేస్టేషన్ ఉంది. అట్టారి భారత్ భూబాగంలో ఉండగా.. వాఘా అనేది పాకిస్థాన్‌లోని ప్రాంతం. అందుకే ఈ ప్రాంతంలో అడుగుపెట్టాలంటే పాకిస్థాన్ వీసా తప్పనిసరి చేశారు. అట్టారి స్టేషన్ నార్త్ రైల్వేలోని ఫిరోజ్‌పూర్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో సైన్యం పహారా కాస్తూ ఉంటుంది. గతంలో భారత్, పాక్ మధ్య.. ఈ స్టేషన్ ద్వారా.. సంజౌతా ఎక్స్‌ప్రెస్ నడిచేది. భారత్, పాకిస్థాన్ మధ్య శాంతియుత సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో.. దాన్ని కూడా రద్దు చేశారు. ఈ అట్టారి వాఘా బోర్డర్‌లో ఇరు దేశాల సైనికులు అనుక్షణం గస్తీ కాస్తూనే ఉంటారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..