Viral Video : పాము అనే పదం చెవిలో పడగానే శరీరంలో ముల్లు గుచ్చుకున్నంత భయం వేస్తుంది చాలా మందికి. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ పాము అంటే భయం. పాము విషం కారణంగా దాని కాటుకు గురైన వారు ప్రాణాలను కోల్పోతారు. కాబట్టి అందరూ పాములంటే భయపడతారు. పాము ఎవరినైనా కాటేస్తే అతని ప్రాణాలు కాపాడటం చాలా కష్టం. పాము విషం మన మనిషి రక్తాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా? ప్రస్తుతం ఓ వైరల్ వీడియో దీని గురించి చెప్పింది. పాము విషం రక్తాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ వైరల్ వీడియో చూపిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. వీడియో చూసిన తర్వాత కొంతమందికి గూస్‌బంప్స్ కూడా రావచ్చు.
ఈ వైరల్ వీడియోలో ఒక ప్రయోగం చూపించబడింది. పాము మానవ రక్తాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ ప్రయోగం చూపిస్తుంది. ఈ వైరల్ వీడియోలో నిపుణుల సహాయంతో ఒక వ్యక్తి గాజు పాత్రలో పాము విషాన్ని పోయడం మీరు చూస్తారు. ఆ వ్యక్తి పాము విషాన్ని వరుసలో పోస్తాడు. ఆ గాజు పాత్రలో ముందుగానే రక్తం నింపిఉంచారు. విషం చుక్కలు రక్తంలో కలవటం మనకు కనిపిస్తుంది. అప్పుడు రక్తం గడ్డకట్టడం మరింత చిక్కగా మారుతుండటం మనం చూడొచ్చు. ఒక్క చుక్క విషం మీ రక్తాన్ని ఎంత లోతుగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి వీడియోను చూడండి.
Effect of snake venom on blood! pic.twitter.com/QDUC9I2vtg
— Learn Something (@cooltechtipz) March 7, 2024
ఈ వీడియో X ఖాతా cooltechtipz నుండి షేర్ చేయబడింది. ఈ వీడియో క్యాప్షన్‌లో రక్తంపై పాము విషం ప్రభావం అని రాసి ఉంది. చాలా మంది వినియోగదారులు వీడియోకు ప్రతిస్పందించారు. ఒక వినియోగదారు ఇది చూడడానికి చాలా భయంగా ఉంది అని రాస్తే, మరొక వినియోగదారు విషం ద్వారా గడ్డకట్టిన రక్తం కోసం బ్లడ్ కేక్ ల మారిందని మరొకరు రాశారు. మరొక వినియోగదారు “బాపరే, పాము కాటువేస్తే రక్తం ఇలా గడ్డకట్టుకుపోతుందా..? అని షాక్ అవుతూ రాశారు. ఈ వీడియో చూసిన చాలా మంది దీనిపై స్పందించారు. ఈ వీడియోను చూసిన కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..