Viral News: వెరీ స్మార్ట్.. దోమల సహాయంతో దొంగను పట్టుకున్న పోలీసులు.. ఎలాగంటే..?

ఓ దొంగను పట్టుకునేందుకు పోలీసులు అతడి ఇంటికి వెళ్లారు. అప్పటికే అతడు తప్పించుకుని వెళ్లిపోయాడు. అయితే పోలీసులు అక్కడ చనిపోయి ఉన్న రెండు దోమలు చూశారు. వెంటనే..

Viral News: వెరీ స్మార్ట్.. దోమల సహాయంతో దొంగను పట్టుకున్న పోలీసులు.. ఎలాగంటే..?
Mosquito Bite

Updated on: Jul 19, 2022 | 7:06 PM

Viral News:  దొంగలు చేసే చిన్న చిన్న పొరపాట్లతో దొరికిపోతుంటారు. కొన్ని కొన్ని సందర్బాల్లో దొంగలకు ఉండే అలవాట్లు కూడా చోరీ కేసులను చేధించేందుకు అనుకూలిస్తుంటాయి. దొంగతనం జరిగిన ప్రదేశంలో వారు విడిచివెళ్లే చిన్న చిన్న వస్తువులే వారిని పట్టిస్తుంటాయి. దొంగలు ఎమరపాటుతో వదిలిపెట్టి వెళ్లే ఆధారాలే వారిని పట్టిస్తుంటాయి. అయితే, దోమల ద్వారా ట్రాప్‌ చేసి దొంగను పట్టుకోవడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? అవును .. ఇలాంటి వింత ఘటన చైనాలో వెలుగులోకి వచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చైనా పోలీసులు దోమల సహాయంతో ఒక దొంగను పట్టుకున్నారు. చైనా ఫుజో‌లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. జరిగింది. ఓ దొంగను పట్టుకునేందుకు పోలీసులు అతడి ఇంటికి వెళ్లారు. అప్పటికే అతడు తప్పించుకుని వెళ్లిపోయాడు. అయితే పోలీసులు అక్కడ చనిపోయి ఉన్న రెండు దోమలు చూశారు. వెంటనే వాటి నుంచి రక్తాన్ని తీసుకొని దానికి డీఎన్ఏ పరీక్ష చేశారు. ఆ వివరాలతో అతడెవరు అనేది తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ‘ఆ ఇల్లు కొత్తగా పెయింటింగ్ చేయబడింది. కాబట్టి ఆ గోడలపై దోమలు చనిపోయి ఉన్నాయి. వాటి నుంచి తమకు దొరికిన రక్తం దొంగదే అయ్యుంటుందని భావించాము. వెంటనే దానిని పరీక్షించి అతడిని అదుపులోకి తీసుకున్నాం’ అని పోలీసు అధికారులు తెలిపారు. ఈ రకంగా దోమలు కూడా పోలీసులకు సాయపడ్డాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్  కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us