లక్ అంటే ఇదే బ్రో.. డిన్నర్‌కు వెళ్లిన జంట.. సరదాగా చేసిన పనితో రూ.12.86 కోట్ల జాక్‌పాట్ కొట్టేశారు!

ఆ టికెట్‌ను స్క్రాచ్ చేసి చూడగా.. అదే మొదటి ప్రైజ్ దక్కించుకోవడం చూసి తమను తాము నమ్మలేకపోయామని వారు చెప్పారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా వారు ఇప్పుడు భవిష్యత్తుపై నమ్మకంతో ఉన్నారు. ఈ గెలుపు వారి జీవితాన్ని మలుపు తిప్పిందని పేర్కొన్నారు.అయితే ఆ దంపతులు మాత్రం తమ పేరు, అడ్రస్ చెప్పడానికి నిరాకరించారు.

లక్ అంటే ఇదే బ్రో.. డిన్నర్‌కు వెళ్లిన జంట..  సరదాగా చేసిన పనితో రూ.12.86  కోట్ల జాక్‌పాట్ కొట్టేశారు!
Lottery Win

Updated on: Jun 07, 2025 | 1:17 PM

అమెరికా న్యూజెర్సీలో ఓ జంటకు అదృష్టం ఊహించని విధంగా కలిసి వచ్చింది. ఓ సాధారణ కుటుంబానికి చెందిన దంపతుల జీవితంలో ఒక్కసారిగా భారీ మార్పు వచ్చింది. వారు ఊహించని విధంగా జాక్‌పాట్‌ తగిలింది. డిన్నర్ డేట్‌కు వెళ్తూ సరదాగా కొన్న లాటరీ $3 (రూ.257) ద్వారా ఏకంగా రూ.12.86 కోట్ల (దాదాపు 1.5 మిలియన్ డాలర్లు) క్యాష్‌ బహుమతిని గెలుచుకున్నారు. అయితే, ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. జంటలో ఒకరు టికెట్ వద్దని చెప్పినా, మరొకరు పట్టుబట్టి కొన్నారట. కానీ, అనుకోని విధంగా వారు కొన్న టికెట్ వల్లే తమకు ఈ అదృష్టం వరించిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ జాక్‌పాట్ వల్ల వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

అందిన సమాచారం ప్రకారం.. న్యూజెర్సీలోని నట్లీ ప్రాంతంలోని 397 సెంటర్ స్ట్రీట్‌లో ఉన్న లక్కీ 7 డెలిలో వైన్ ఫర్ లైఫ్.. స్క్రాచ్-ఆఫ్ టికెట్‌ను కొనుగోలు చేశారు ఈ జంట. అయితే ఈ టికెట్ విజేతగా నిలవడంతో వారు తొలుత షాక్ తిన్నారు. చాలా సేపటి వరకు తమకు వరించిన అదృష్టాన్ని నమ్మలేక.. ఆశ్చర్యంలో మునిగిపోయారు.

ఆ టికెట్‌ను స్క్రాచ్ చేసి చూడగా.. అదే మొదటి ప్రైజ్ దక్కించుకోవడం చూసి తమను తాము నమ్మలేకపోయామని వారు చెప్పారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా వారు ఇప్పుడు భవిష్యత్తుపై నమ్మకంతో ఉన్నారు. ఈ గెలుపు వారి జీవితాన్ని మలుపు తిప్పిందని పేర్కొన్నారు.అయితే ఆ దంపతులు మాత్రం తమ పేరు, అడ్రస్ చెప్పడానికి నిరాకరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..