అడవి ప్రపంచానికి ఒకటే రూల్. ఒక జీవికి ఆకలి వేస్తే.. మరో జీవి లైఫ్ ఖతం అంతే. ఇక ఒక్కో జీవికి ఒక్కో రకమైన వేట విధానం ఉంటుంది. కొన్ని జంతువులు మాటు వేసి.. అదును చూసి వేటాడతాయి. మరికొన్ని.. ఏమీ ఆలోచించకుండా వేటలోకి దూసుకెళ్లిపోతాయి. అయితే అడవికి రాజైన సింహం.. అక్కడ ప్రదర్శించే దర్పం మాములుగా ఉండదు. ఏ జంతువులకు భయపడకుండా.. ఎక్కడపడితే అక్కడ స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. ఎంత పెద్ద జంతువు ఎదురైనా.. కొంచెం కూడా జంకవు. దేనితో అయినా సరే పోరాడేందుకు వెనకాడవు. అయితే ఈ మధ్య కొన్ని వీడియోలు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. ఇటీవల దారిలో ఓ పాము కనిపించడంతో.. ఓ సింహం వెనక్కి తగ్గిన వీడియో వైరల్ అయింది. తాజాగా అలాంటిదే మరో వీడియో వైరల్ అవుతోంది. సింహాలు.. పిల్లి మాదిరిగా తోక ముడిచి తామున్న ప్రాంతం నుంచి జారుకోవడం ఈ వీడియోలో కనిపించింది
దీన్ని చూసిన తర్వాత చాలామంది తమ కళ్లను నమ్మలేకపోతున్నారు. వీడియోలో మీరు రెండు సింహాలు ఓ ప్రాంతంలో కూర్చుని ఉన్నాయి. అదే సమయంలో రెండు ఖడ్గమృగాలు అటుగా వచ్చాయి. వాటిని చూసిన సింహాలు వెంటనే లేచి పక్కకు వెళ్లిపోయాయి. ఖడ్గమృగాలు కాసేపు అదే ప్రాంతంలో ఉండటంతో.. రెండు మగ సింహాలు తోక ముడిచి అక్కడి నుంచి జారుకున్నాయి.
వీడియో దిగువన చూడండి..
So does this make Rhino the King of the jungle then? pic.twitter.com/e4ok6lNLGS
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 26, 2024
ఈ వీడియో @AMAZlNGNATURE అనే ఖాతా ద్వారా Xలో షేర్ చేశారు. ఈ వార్త రాసే వరకు, 98 లక్షల మందికి పైగా ప్రజలు దీనిని చూశారు. రకరకాల ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. ‘సింహం పిరికి కాదు కానీ తెలివైనది, అది అనవసరంగా పోరాడదు’అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘అడవిలో జంతువుల ప్రవర్తన ఎప్పుడూ ఆశ్చర్యకరమే’ అని మరొకరు పేర్కొన్నారు. ‘ఖడ్గమృగాల కొమ్ములను చూసి సింహాలకు సుస్సు పడింది.. అందుకే సింహాలు అక్కడి నుంచి పారిపోయాయి’ అని మరొకరు రాసుకొచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..