AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: డెంటిస్ట్‌గా మారిన చిలుక.. ఇది చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు!

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో నలుమూలలా ఏం జరుగుతున్నా మన కళ్ల ముందు ప్రత్యక్ష్యం అవుతున్నాయి. ఈ వీడియోల నుంచి మంచి చెడూ రెండు తెలుస్తున్నాయి. ఈ సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. మరికొంత మంది అభాసుపాలు కూడా అవుతున్నారు. ఇంకొంత మంది సోషల్ మీడియా నుంచి వచ్చే నెగిటివిటీని తట్టుకోలేక చనిపోతున్నారు. అయితే కొన్ని కొన్ని వీడియోలు చూస్తే మాత్రం ఖచ్చితంగా..

Viral Video: డెంటిస్ట్‌గా మారిన చిలుక.. ఇది చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు!
Viral Video
Chinni Enni
|

Updated on: Mar 26, 2024 | 6:52 PM

Share

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో నలుమూలలా ఏం జరుగుతున్నా మన కళ్ల ముందు ప్రత్యక్ష్యం అవుతున్నాయి. ఈ వీడియోల నుంచి మంచి చెడూ రెండు తెలుస్తున్నాయి. ఈ సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. మరికొంత మంది అభాసుపాలు కూడా అవుతున్నారు. ఇంకొంత మంది సోషల్ మీడియా నుంచి వచ్చే నెగిటివిటీని తట్టుకోలేక చనిపోతున్నారు. అయితే కొన్ని కొన్ని వీడియోలు చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇందులో పిల్లల వీడియోలు, పక్షులు, జంతువులకు సంబంధించినవి కూడా ఉంటాయి. అవి ఎంతో చూడ ముచ్చటగా ఉంటాయి. చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటాయి. జంతువులు, పక్షులు ఇలా కూడా చేస్తాయా అని ఆ వీడియోలు చూశాకే తెలుస్తాయి.

అలా ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. ఓ చిలుక వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఓ చిలుక డెంటిస్ట్‌గా మారింది. ఓ బాలుడి నోటిలోని పుచ్చిపోయిన పళ్లను బయటకు తీసింది. అది కూడా నొప్పి లేకుండా. ఈ డెంటిస్ట్‌ ప్యారెట్‌ను చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.

ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి రామ చిలుకను పట్టుకున్నాడు. ఓ బాలుడి నోటి దగ్గరకు తీసుకువచ్చాడు. చిలుక బాలుడి నోట్లో తన ముక్కు ద్వారా పుచ్చిపోయిన పళ్లను తీసింది. అది కూడా నొప్పి లేకుండా. ఆ పన్ను పీకడంతో బాలుడు కూడా ఒకింత షాక్‌కి గురవుతాడు. ఈ వీడియో ఎక్కడిదో వివరాలు సరిగ్గా లేవు కానీ.. ఎవరో పక్షి ప్రేమికులు ఈ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ డెంటిస్ట్ ప్యారెట్ వివరాలు చెప్పమంటున్నారు. ఖర్చులేకుండా పుచ్చిపోయిన పళ్లను తీసుకుంటామని అంటున్నారు. అయితే ఇంకొంత మంది మనుషుల లాలాజలంలో పక్షులకు అనారోగ్యం కలిగించే సూక్ష్మ క్రిములు ఉంటాయని.. అలా చేయడం తప్పని అంటున్నారు.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..