
Artificial Incubation Cobra Eggs: వన్యప్రాణి సంరక్షణ రంగంలో దిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్ (జాతీయ జంతు ప్రదర్శనశాల) అధికారులు ఒక అరుదైన మైలురాయిని అధిగమించారు. గత 15 సంవత్సరాలుగా ఎన్నో విఫలయత్నాల తర్వాత, ఎట్టకేలకు అత్యాధునిక సాంకేతికత సాయంతో నాగుపాము గుడ్లను కృత్రిమంగా పొదిగించడంలో జూ పశువైద్య బృందం ఘన విజయం సాధించింది. సైంటిఫిక్ యానిమల్ మేనేజ్‌మెంట్‌లో ఇదొక చారిత్రాత్మక విజయమని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా నాగుపాము వంటి సరీసృపాలు జూ వాతావరణంలో గుడ్లు పెట్టినప్పటికీ, సరైన అనుకూల పరిస్థితులు లేక అవి పిల్లలుగా మారడం చాలా కష్టంగా మారుతుంది. గత పదిహేనేళ్లుగా దిల్లీ జూలో ఈ జాతి సంతానోత్పత్తి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఈసారి జూ అధికారులు పట్టుదలగా శ్రమించి, కొత్తగా సేకరించిన మూడు నాగుపాము గుడ్లను తల్లి పాము వద్ద ఉంచకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కృత్రిమ సంరక్షణ కేంద్రానికి (ఇంక్యుబేషన్ చాంబర్) తరలించారు.
VIDEO | National Zoological Park (NZP), New Delhi, has announced the successful hatching of three Indian cobra (Naja naja) hatchlings. The hatchlings emerged on June 29-30 after a successful incubation period and are healthy, active, and being monitored in a species-appropriate… pic.twitter.com/GviIxnfz8M
— Press Trust of India (@PTI_News) July 12, 2026
ఈ అద్భుత ప్రక్రియ వెనుక జూ రక్షణ బృందం, పశువైద్య నిపుణుల రాత్రింబవళ్ల శ్రమ దాగి ఉంది. ల్యాబ్‌లోని ప్రత్యేక యంత్రాల సాయంతో గుడ్లు పొదగడానికి అవసరమైన ఉష్ణోగ్రత, తేమ స్థాయిలను ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ, ప్రకృతిసిద్ధమైన వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించారు. జూన్ 29 నుంచి జూన్ 30 మధ్య కాలంలో ఈ మూడు గుడ్ల నుంచి బుజ్జి నాగుపాము పిల్లలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి లోకాన్ని చూశాయి.
ప్రస్తుతం ఈ మూడు నాగుపాము పిల్లలు ఎంతో ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నాయని జూ అధికారులు అధికారిక ప్రకటనలో తెలిపారు. వాటి జాతికి తగినట్లుగా, శీతోష్ణస్థితులు సరిపోయేలా ప్రత్యేక రక్షణ వలయంలో ఉంచి నిరంతరం గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విజయవంతమైన ప్రయోగంపై జూ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో భాగమైన విద్యార్థులు కూడా సరీసృపాల ప్రవర్తన, వాటి శారీరక మార్పులపై లోతైన అధ్యయనం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..