ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకునేందుకు ఓ ఆటో డ్రైవర్ ఎవరూ చేయని పనిచేశాడు..రోడ్డుపై వెళ్తే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి వస్తుందని..ఏకంగా బ్రిడ్జిపైకి ఆటోను ఎక్కించాడు. ఆటో రిక్షా బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న సీన్ చూసిన స్థానికప్రజలు, ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఈ విచిత్ర సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. హమ్‌దర్త్ నగరంలోని ఓ బ్రిడ్జిపై ఆటో చక్కర్లు కొట్టింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఉండటం గమనించిన ఆటోరిక్షా డ్రైవర్ ఇలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు.
జి-20 సదస్సుకు ఢిల్లీ అత్యంత పకడ్భందిగా సిద్ధమైంది. జి-20 సదస్సు కారణంగా ఢిల్లీలోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ పెరుగుతోంది. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఢిల్లీ వ్యాప్తంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్‌లను నివారించడానికి చాలా మంది వినూత్న మార్గాలను అన్వేసిస్తున్నారు. తాజాగా బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న ఈ వీడియో కూడా ఇదే కోవకు చెందినది నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఢిల్లీ సంగమ్ విహార్ ట్రాఫిక్ సర్కిల్ ప్రాంతానికి చెందినదిగా తెలిసింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదుగా ఓ ఆటో డ్రైవర్ ఆటో నడుపుతున్నాడు. ఈ సీన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆటోడ్రైవర్ చేసిన జనాలు నివ్వెర పోయి చూస్తుండిపోయారు.
వైరల్ అవుతున్న వీడియోలో చుట్టుపక్కల ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉందని తెలుస్తుంది. ఇంతలో ఓ ఆటో డ్రైవర్ వచ్చి నేరుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదుగా ఆటోను వేగంగా తీసుకెళ్తున్నాడు. ఆటోడ్రైవర్ చేసిన ఈ విన్యాసాన్ని చూసి అక్కడున్న జనం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో క్రమంగా వైరల్ అవుతోంది. ప్రజలు దీన్ని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్ స్టంట్ చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సంగం విహార్‌లో నివాసం ఉంటున్న 25 ఏళ్ల డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అతడికి సాయం చేసేందుకు ఆటో ఎక్కిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.అతన్ని సంగం విహార్‌కు చెందిన అమిత్‌గా గుర్తించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..