Wild Dogs – Deers Viral Video: అటవీ ప్రపంచంలో చాలా రకాల జంతువులు ఉంటాయి. వాటిలో కొన్ని మృధు స్వభావంతో.. మరికొన్ని చాలా ప్రమాదకరమైనవిగా ఉంటాయి. అయితే.. సాధారణంగా జింక వంటి జంతువులు.. సింహం, పులి, చిరుత లాంటి ప్రమాద జంతువులకు వేటగా మారుతాయి. జింకలను వేటాడటంలో అడవి కుక్కలు కూడా ముందే ఉంటాయి. అందుకే వాటి నుంచి దూరంగా ఉండేందుకు జింకలు, పలు చిన్న జీవులు ప్రయత్నిస్తుంటాయి. తాజాగా.. అడవి కుక్కలు.. జింకలను వేటాడేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో వాటి నుంచి తప్పించుకునేందుకు జింకలు అనుసరించిన ప్లాన్ నెట్టింట (Social Media) వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా జింకల ప్లాన్ మామూలుగా లేదుగా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
వైరల్ వీడియోలో.. మూడు జింకలు ఎత్తైన రాయి అంచున ఉండటాన్ని మీరు చూడవచ్చు. అయితే అడవి కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు ఈ మూడు జింకలు అక్కడే కదల కుండా నిల్చున్నాయి. అయితే.. అక్కడికి చేరుకోవడం మాత్రం కుక్కలకు సవాలుగా మారింది. ఒకటి, రెండు అడవి కుక్కలు రాయి అంచుకు జింకల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాయి. కానీ వాటి ప్రయత్నం ఫలించదు. దీంతో తమ ప్రయత్నం ఫలించడం లేదంటూ అడవి కుక్కలన్నీ అక్కడే చాలా సేపు నిల్చొని చూస్తుంటాయి.
వైరల్ వీడియో..
Balancing life…
Keeping calm at the face of death.?MalaMala Game Reserve pic.twitter.com/NctUAywQRW
— Susanta Nanda IFS (@susantananda3) February 23, 2022
ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ 41 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 30 వేలకు పైగా వీక్షించగా, 2 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చాలా థ్రిల్లింగ్‌గా ఉందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Read: