AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం, వజ్రాల కంటే ఖరీదైన విషం.. లీటరు ధర కోట్లలో పలికే ఈ జీవి గురించి తెలిస్తే..

ఒక్క కాటుతో ప్రాణాలు తీసే భయంకరమైన తేలు.. కోట్లాది రూపాయల సంపదను ఎలా సృష్టిస్తుందో తెలుసా? ఒకే ఒక్క తేలు నుంచి కేవలం 0.006 మిల్లీలీటర్ల విషం మాత్రమే లభించే ఈ అరుదైన జీవి ద్రవం వెనుక ఉన్న సీక్రెట్స్, వైద్య పరిశోధనల్లో అది చేస్తున్న అద్భుతాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారం, వజ్రాల కంటే ఖరీదైన విషం.. లీటరు ధర కోట్లలో పలికే ఈ జీవి గురించి తెలిస్తే..
Deathstalker Scorpion Venom
Krishna S
|

Updated on: Aug 29, 2026 | 2:30 PM

Share

ప్రపంచంలో బంగారం, వజ్రాలను అత్యంత ఖరీదైనవిగా భావిస్తాం. కానీ ఒక చిన్న జీవి విషం వీటన్నింటి కంటే కోట్ల రెట్లు ఎక్కువ విలువ చేస్తుందని మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో ఒకటైన తేలు విషం మార్కెట్‌లో లీటరుకు కోట్ల రూపాయల ధర పలుకుతోంది. కింగ్‌ కోబ్రా విషం కంటే ఎంతో శక్తివంతమైన ఈ తేలు విషానికి అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంది. డెత్‌స్టాకర్ తేలు ప్రధానంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలలోని ఎడారి ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీని విషం రసాయన కూర్పు అత్యంత సంక్లిష్టమైనది. ఒక తేలు నుంచి ఒకేసారి సగటున కేవలం 0.006 మిల్లీలీటర్ల విషం మాత్రమే లభిస్తుంది. ఒక గ్యాలన్ విషాన్ని సేకరించాలంటే లక్షలాది తేళ్లను పట్టుకోవాల్సి ఉంటుంది. విషాన్ని సేకరించడం, దానిలోని సహజ గుణాలు చెడిపోకుండా భద్రపరచడం, ప్రయోగశాలల కోసం శుద్ధి చేయడం అత్యంత శ్రమతో కూడుకున్న ప్రక్రియ.

విషాన్ని ఎలా తీస్తారు?

తేళ్ల నుంచి విషాన్ని సేకరించేందుకు శిక్షణ పొందిన నిపుణులు ప్రత్యేక పద్ధతులను ఉపయోగిస్తారు. తేలుకు ఎలాంటి హాని కలగకుండా, దాని తోక భాగానికి స్వల్ప స్థాయిలో విద్యుత్ షాక్ ఇస్తారు. దాంతో తేలు విషాన్ని విడుదల చేస్తుంది. ఈ విధానంలో సేకరించిన విషాన్ని ప్రోటీన్లు, పెప్టైడ్లు దెబ్బతినకుండా వెంటనే ల్యాబ్‌లకు తరలిస్తారు.

వైద్య రంగంలో అద్భుత ఉపయోగాలు

డెత్‌స్టాకర్ విషానికి ఇంతటి విలువ ఉండటానికి కారణం వైద్య పరిశోధనల్లో దీనికి ఉన్న అద్భుత లక్షణాలే.

మెదడు కణితి గుర్తింపు: ఈ విషంలో ఉండే క్లోరోటాక్సిన్ అనే ప్రొటీన్ మెదడులోని క్యాన్సర్ కణాలను సులభంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది.

కీలక ఔషధాల తయారీ: క్యాన్సర్ చికిత్స, తీవ్రమైన నొప్పి నివారణ మందులు, సరికొత్త యాంటీబయాటిక్స్ మరియు ఆటో ఇమ్యూన్ వ్యాధుల మందుల తయారీలో ఈ విషాన్ని వాడుతున్నారు.

సౌందర్య – వ్యవసాయ ఉత్పత్తులు: కొన్ని రకాల కాస్మెటిక్స్, అధునాతన సహజ పురుగుమందుల తయారీలోనూ దీనిని ఉపయోగిస్తున్నారు.

అత్యధిక ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది?

ఎండలు ఎక్కువగా ఉండే పొడి ఎడారి ప్రాంతాలైన ఈజిప్ట్, టర్కీ, ఇరాన్ వంటి దేశాలు తేలు విషం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాయి. రాళ్ల కింద నివసించే ఎడారి తేళ్ల విషంలో గాఢత, శక్తి అత్యధికంగా ఉంటాయి. అందుకే ఈ దేశాల్లో ప్రత్యేకంగా తేళ్ల పెంపక కేంద్రాలను ఏర్పాటు చేసి విషాన్ని అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు.

Follow Us