Viral Photo: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. కనిపెట్టండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్

|

Jan 22, 2022 | 8:02 PM

పజిల్స్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం. చాలామందికి ఉంటుంది.. ఎందుకంటే టాస్క్ ఏదైనా కంప్లీట్ చేయాలనే ఆత్మవిశ్వాసంతో చాలామంది ఉంటారు. తాజాగా మీ ముందుకు ఓ ఫోటో పజిల్ తీసుకొచ్చాం.

Viral Photo: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. కనిపెట్టండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్
Find The Snake
Follow us on

Find The Snake: ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో టైమ్ పాస్ చెయ్యడానికి మార్గాలు కోకొల్లలు. అందులో పజిల్స్ కూడా ఒక మెథడ్. ఇక కాస్త బుర్రకు పదునుపెట్టాలనుకునేవారు పజిల్స్ పై ఇంట్రస్ట్ చూపిస్తారు. చాలామంది పజిల్ కనిపిస్తే.. దాని అంతుచూసేవరకు  వదిలిపెట్టరు. దాన్ని సాల్వ్ చేస్తే అదో రకమైన సంతృప్తి దొరకుతుంది. పజిల్స్ సాల్వ్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అదే పనిగా పజిల్స్‌ సాల్వ్ చేయడాన్ని ఆస్వాదించేవారు కూడా ఉంటారు. అది వారి వ్యాపకం అనుకోవాలి అయితే పజిల్స్ లో చాలా టైప్స్ ఉంటాయి కదా..!. మ్యాగ్‌జైన్స్‌లో వచ్చే పదాల పజిల్స్ ఓ రకం.  వీటిని భాషపై నాలెడ్జ్.. కాస్త క్లవర్ మైండ్ ఉంటే ఈజీగా సాల్వ్ చేయవచ్చు. కానీ ఫోటో పజిల్స్ పరిష్కరించాలంటే కాస్త టైమ్ వెచ్చించాల్సిందే. కొన్నిసార్లు అయితే సాల్వ్ చేయడం అసాధ్యం అనే చెప్పాలి. వీటిని సాల్వ్ చేయాలంటే మీ చూపుల్లో పవర్ ఉండాలి. బుర్ర యాక్టివ్‌గా వర్క్ చేయాలి. ఈ మధ్య కాలంలో ఈ ఫోటో పజిల్స్ పై నెటిజన్స్ బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ‘ఈ ఫోటోలో ఎన్ని జంతువులు ఉన్నాయి’.. ‘ఈ చిత్రంలోని జంతువును కనిపెట్టండి’.. లాంటి పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ప్రత్యేకంగా ఈ  ఫోటో పజిల్స్‌ను అందించేందుకు పలు సోషల్ మీడియా పేజెస్ కూడా అందుబాటులో ఉన్నాయి

తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు పైన చూస్తోన్న ఫోటోలో ఓ పాము దాగుంది.  దాన్ని కనిపెట్టడం మరీ అంత కష్టం ఏం కాదు. కాస్త పేషెన్స్‌తో చూస్తే ఈజీగానే సాల్వ్ చేయవచ్చు. నూటికి 50 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేస్తున్నారు. ఫోటోలోని పామును వెంటనే కనిపెట్టారంటే మీరు గ్రేట్ అని ఒప్పుకోవాలి. మీ మెదడుకు కాస్త మేత వేయాలంటే ఈ పజిల్ సాల్వ్ చేయండి. లేదంటే కింద ఫోటోను చూడండి.

Also Read: Brahma kamalam: బిక్కవోలులో ఒకే మొక్కకు 80 బ్రహ్మ కమలాలు.. ప్రత్యేకతలివే, చూసేందుకు వస్తున్న జనం