ఈతరం యూత్ తమకు నచ్చినట్టుగా బతుకడానికి ఆసక్తి చూపుతున్నారు. పెద్దలు చెప్పినా, కన్నవాళ్లు వద్దని వారించినా డోన్ట్ కేర్ అంటూ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వ్యామోహమో, సినిమాల ప్రభావమో కానీ చిన్న వయసులోనే ప్రేమ పెళ్లిలకు సిద్ధపడుతున్నారు. తల్లిదండ్రులు వద్దని చెప్పినా ఎదురించి తమకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. అంతేకాదు.. తల్లిదండ్రులకు శాశ్వాతంగా గుడ్ బై చెప్పి సొంతింటి నుంచి వెళ్లిపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఓ అమ్మాయి ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. దీంతో ఆవేదన చెందిన ఓ తండ్రి అయ్యారాలా.. బిడ్డలారా.. ఇలా అస్సలు చేయకండి. నా బిడ్డను ఎవరో ట్రాప్ చేశారో. దొంగలు మోయమాటలు చెప్పి లొంగదీసుకున్నారు అంటూ కంటతడి పెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు.. కూతురు చనిపోయిందంటూ తమ ఇంటి ముందు వర్ధంతి ఫ్లెక్సీ పెట్టి ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.