సినీ ఫక్కీలో.. గాల్లో..ఆకాశంలో ఎగురుతూ.. ఇంగ్లిష్ ఛానల్ దాటాడు

|

Aug 04, 2019 | 4:20 PM

అచ్ఛు సినీ ఫక్కీలో అతగాడో సాహస కార్యం చేశాడు. అతి పెద్దదైన ఇంగ్లిష్ ఛానల్ ని అలవోకగా.. ఎగురుతూ దాటేశాడు. డేర్ డెవిల్ స్టంట్లను ఇష్టపడే ఆ పెద్దమనిషి పేరు ఫ్రాంకీ జపాటా.. ఫ్రెంచ్ దేశస్థుడైన ఈ 40 ఏళ్ళ వ్యక్తి ఆదివారం ఉదయం.. ఫ్రాన్స్ లోని సంగాట్టే బీచ్ నుంచి జెట్ ఇంజన్లతో కూర్చిన ‘ హోవర్ బోర్డు ‘ ను కాళ్లకు బిగించుకుని గాల్లో ఎగురుతూ ఛానల్ అవతలివైపు డోవర్ అనే ప్రాంతంలోని కొండలపై […]

సినీ ఫక్కీలో.. గాల్లో..ఆకాశంలో ఎగురుతూ.. ఇంగ్లిష్ ఛానల్ దాటాడు
Follow us on

అచ్ఛు సినీ ఫక్కీలో అతగాడో సాహస కార్యం చేశాడు. అతి పెద్దదైన ఇంగ్లిష్ ఛానల్ ని అలవోకగా.. ఎగురుతూ దాటేశాడు. డేర్ డెవిల్ స్టంట్లను ఇష్టపడే ఆ పెద్దమనిషి పేరు ఫ్రాంకీ జపాటా.. ఫ్రెంచ్ దేశస్థుడైన ఈ 40 ఏళ్ళ వ్యక్తి ఆదివారం ఉదయం.. ఫ్రాన్స్ లోని సంగాట్టే బీచ్ నుంచి జెట్ ఇంజన్లతో కూర్చిన ‘ హోవర్ బోర్డు ‘ ను కాళ్లకు బిగించుకుని గాల్లో ఎగురుతూ ఛానల్ అవతలివైపు డోవర్ అనే ప్రాంతంలోని కొండలపై సురక్షితంగా దిగాడు. ఆకాశ మార్గాన ఈ ఛానల్ దాటిన మొట్టమొదటి వ్యక్తి అయ్యాడు. ఇందుకు ఇతనికి కేవలం 23 నిముషాలు మాత్రమే పట్టిందట. ఆకాశ మార్గాన సాగుతుండగా జపాటా కు ఎలాంటి ప్రమాదం జరగకుండా రెండు హెలికాఫ్టర్లు అతని వెన్నంటే ఎగిరాయి. మాజీ జెట్ స్కై చాంపియన్ కూడా అయిన జపాటా..గతవారం ఇలాంటి ప్రయత్నమే చేసి ఫెయిలయ్యాడు. కానీ ఈ సారి సక్సెస్ అయ్యి.. ఆ ఆనందాన్ని తన ఫ్రెండ్స్ తోను, ప్రజలతోను పంచుకున్నాడు. అన్నట్టు ఇతడు తన కాళ్లకు బిగించుకున్న హోవర్ బోర్డుకు కిరోసినే ఇంధనం. కాస్త పెద్ద టీ ట్రే మాదిరి ఉండే ఈ మినీ ఫ్లయింగ్ మెషిన్ కి అయిదు టర్బో జెట్లు ఉంటాయి. వీటి సాయంతో గాల్లో సులభంగా ఎగురవచ్ఛు. నీటికి 49 అడుగుల ఎత్తున ఇతని ‘ గగన యానం ‘ సాగింది. ఈ సాహస కార్యం చేసిన జమాటా ను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు.