
ఉత్తరప్రదేశ్‌లో పలువురు యువకులు అత్యంత ప్రమాదకరంగా ట్రాక్టర్లతో విన్యాసాలు చేస్తూ రీల్స్ చేశారు. నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో రెండు ట్రాక్టర్ల ప్రమాదకరమైన స్టంట్ వెలుగులోకి వచ్చింది. ఫరూఖాబాద్‌లో కొందరు యువకులు రెండు ట్రాక్టర్లను తాళ్లతో కట్టి విన్యాసాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో రెండు ట్రాక్టర్లను తాడుతో కట్టి రోడ్డుపైకి లాగుతున్న యువకుల విన్యాసాల అందరినీ షాక్‌కు గురి చేశాయి.
ఈ సంఘటన నవాబ్‌గంజ్‌లోని దునాయ రోడ్డుపై చోటు చేసుకుంది. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రదేశంలో యువకులు తరచుగా ట్రాక్టర్లతో విన్యాసాలు చేస్తారు. వీడియోలో కనిపిస్తున్న ట్రాక్టర్ నగరంలోని మొహల్లా నివాసికి చెందినది. అతని సోషల్ మీడియా ఖాతాలో ఇలాంటి అనేక స్టంట్ వీడియోలు ఉన్నాయి.
వీడియో ఇక్కడ చూడండి..
ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోలో రహదారిపై రెండు వేర్వేరు కంపెనీలకు చెందిన ట్రాక్టర్ల హార్స్‌పవర్‌ను పరీక్షిస్తూ వీడియో తీశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నవాబ్‌గంజ్ పోలీసులు సదరు యువకులపై రోడ్డు భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మొహమ్మదాబాద్ ఏరియా అధికారి అజయ్ బర్మా తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..