Viral Video: స్కూల్‌కి వెళ్లిన అనంతరం పుస్తకాల కోసం బ్యాగ్ ఓపెన్ చేసిన స్టూడెంట్.. ఒక్కసారిగా బుసలు కొడుతూ

|

Sep 22, 2022 | 8:23 PM

యథావిధిగానే ఆ అమ్మాయి తన స్కూల్ బ్యాగు తీసుకుని పాఠశాలకు వెళ్లింది. పుస్తకం కోసం బ్యాగ్ ఓపెన్ చేసి.. ఒక్కసారిగా పరుగులు తీసింది. ఏమైందంటే..?

Viral Video: స్కూల్‌కి వెళ్లిన అనంతరం పుస్తకాల కోసం బ్యాగ్ ఓపెన్ చేసిన స్టూడెంట్.. ఒక్కసారిగా బుసలు కొడుతూ
Snake In Bag (Representative image)
Follow us on

Trending: మధ్యప్రదేశ్(Madhya Pradesh)​‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది.  శివపురి జిల్లాలోని విద్యార్థి స్కూల్​ బ్యాగ్​లో కోబ్రా దర్మనమిచ్చింది. జిల్లాలోని బదౌని స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న ఓ విద్యార్థిని ఎప్పట్లానే తన పుస్తకాల బ్యాగుతో పాఠశాలకు వచ్చింది. క్లాస్ రూమ్‌కి వచ్చిన అనంతరం.. బుక్స్ తీసుకునేందుకు బ్యాగ్ ఓపెన్ చేసి కంగుతింది. లోపల నాగు పాము బుసలు కొడుతూ కనిపించింది. దీంతో తరగతి గదిలో గందరగోళం నెలకుంది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఉపాధ్యాయులు సైతం భయపడ్డారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి  ధైర్యం చేసి… ఆ బ్యాగును అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లి ఖాళీ స్థలంలో వదిలేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థినిని ఆ పాము కాటు వేయకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఆ పాము ఇంటి వద్దే బ్యాగులోకి దూరి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

వీడియో చూడండి…

ప్రజంట్ వర్షాకాలం. దీంతో పాములు ఆవాసాలను కోల్పోయి.. జన సంచారం ఉన్న ప్రాంతాల్లోకి వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అడవులు, పొలాలకు సమీప ప్రాంతాల్లో నివశించేవారికి పాములతో ప్రమాదం ఎక్కువ. అందుకే వారు అలెర్ట్‌గా ఉండాలి. కాగా సర్పాలు కంటపడితే చంపకుండా.. తమకు లేదా స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం ఇవ్వాలని.. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు కోరుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి