Telugu News Trending CWG 2022: Indian womens hockey team dancing celebrations after win's bronze medal
Commonwealth games 2022: గెలిచిన ఆనందంలో డ్యాన్స్ తో దుమ్మురేపిన భారత మహిళల హాకీ జట్టు..
బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో న్యూజిలాండ్ తో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో విజయం సాధించిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో భారత మహిళల హాకీ జట్టు డ్యాన్స్ తో దుమ్ము రేపింది. 'సబ్సే ఆగే హోంగే హిందుస్తానీ' పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Womens Hockey: క్రీడల్లో గెలుపోటములు సహజం..గెలుపు ఆనందానిస్తే..ఓటమి నుంచి ఎదురైన అనుభవాలు భవిష్యత్తులో గెలవడానికి దారిచూపిస్తాయి. గెలిచిన తర్వాత ఎగిరి గంతెయ్యడం సర్వసాధారణం..భారత మహిళల హాకీ జట్టు కూడా అదే చేసింది. బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో న్యూజిలాండ్ తో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో విజయం సాధించిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో భారత మహిళల హాకీ జట్టు డ్యాన్స్ తో దుమ్ము రేపింది. ‘సబ్సే ఆగే హోంగే హిందుస్తానీ’ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రీడాకారులంతా ఆపాటను అనుకరిస్తూ విజయాన్ని ఆశ్వాదించారు.
భారత మహిళల హాకీ జట్టు 16 ఏళ్ల విరామం తర్వాత కామన్ వెల్త్ క్రీడల్లో పతకం సాధించింది. కెప్టెన్ సవిత పునియా అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ ను ఘూటౌట్లో 2-1 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ..పతకం కోసం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆట నిర్ణీత సమయం ముగిసే సరికి రెండు జట్లు 1-1 స్కోర్ తో సమంగా నిలిచాయి. ఈదశలో షూటౌట్లో గోల్ కీపర్ సవిత పునియా ఉత్తమమైన ఆట ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టు గోల్స్ చేయకుండా నిలువరించగలిగింది. దీంతో సోనిక, నవనీత్ షూటౌట్లో ఇండియా తరఫున స్కోర్ చేయడంతో 1-2 తేడాతో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెల్చుకుంది.