Viral Video: ఆస్కార్ గోస్ టు..క్యూట్ క్యాట్స్..! వీడియో చూశాక నిజమేనంటారు మీరు కూడా..
పెంపుడు జంతువులు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని చాలా సందర్భాల్లో నిర్ధారణ అయింది. అవి చేసే వింత వింత పనులు, అల్లరి మనసుకు ఆనందాన్నిస్తాయి. ఇకపోతే,
పెంపుడు జంతువులు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని చాలా సందర్భాల్లో నిర్ధారణ అయింది. అవి చేసే వింత వింత పనులు, అల్లరి మనసుకు ఆనందాన్నిస్తాయి. ఇకపోతే, సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల పెంపుడు జంతువుల వీడియోలు హల్‌చల్ అవుతుంటాయి. వాటి చేష్టలకు నెటిజన్లు తెగ నవ్వుకుంటారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో పిల్లులు చేస్తున్న వెరైటీ స్టంట్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పిల్లులు చేసిన పని చూస్తే మీరు షాక్ అవుతారు.
వైరల్ వీడియోలో, ఒక గదిలో రెండు పిల్లులు కలిసి కూర్చున్నట్లు ఈ వీడియోలో మీరు చూడొచ్చు.. కొంచెం దూరంలో ఓ వ్యక్తి ఎదురుగా నిలబడి ఉన్నాడు. వీడియోలో వ్యక్తి ముఖం కనిపించడం లేదు. రెండు పిల్లులు వ్యక్తిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నట్లు మీరు తర్వాత చూస్తారు. ఆ తర్వాత, అతడు ఆ పిల్లులకు కొన్ని మార్షల్ ఆర్ట్స్ ట్రిక్స్ చూపిస్తాడు. మనిషి దూరం నుండి గాలిలో తన చేతిని ఊపుతూ, ఆపై ఒక థ్రస్ట్ కొట్టాడు. తర్వాత ఏం జరుగుతుందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.
పిల్లుల నటనను చూసి ఎవరైనా నవ్వుతారు..అతడు చేస్తున్న ట్రిక్స్‌తో ముందుగా ఓ పిల్లి నేలపై వెల్లకీలా వాలిపోయింది. వ్యక్తి మళ్లీ అదే యుక్తిని చూపాడు..ఈసారి మరో పిల్లి కూడా బోల్తా కొట్టింది. ఇక్కడ ఈ రెండు పిల్లులు మనుషుల్లా ప్రవర్తించడం చూసి మీరు నవ్వుకుంటారు.
— viral videos (@viralvideoss2) February 6, 2022
ఈ వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. ఇది ఫిగెన్ అనే ట్విట్టర్ ఖాతాదారు షేర్ చేశారు..దానికి “ఆస్కార్ గోస్ టు…..” అంటూ ట్యాగ్‌లైన్ కూడా జతచేశారు. ప్రజలు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 57K లైక్స్ వచ్చాయి. అదే సమయంలో, ఇప్పటివరకు 4.1 మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. దీనిపై యూజర్లు ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. వీడియో చూశాక మీరు మీ కామెంట్ షేర్ చేయండి..