Viral Video: ఈ వధువు చూడండి వివాహాన్ని ఎలా ఆస్వాదిస్తుందో.. వీడియో చూస్తే వావ్ అంటారు

|

Sep 05, 2021 | 8:11 PM

పెళ్లి అంటే వధూవరులపై ఫోకస్ ఉంటుంది. అందులోనూ వీడియోగ్రాఫర్ లేదా ఫోటోగ్రాఫర్ వారి మూమెంట్‌ను ఫాలో అవుతుంటారు. అందుకే వధూవరుల...

Viral Video: ఈ వధువు చూడండి వివాహాన్ని ఎలా ఆస్వాదిస్తుందో.. వీడియో చూస్తే వావ్ అంటారు
Bride Video
Follow us on

ఈ మధ్య వెడ్డింగ్‌కు సంబంధించిన వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫేస్ బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్.. ఇలా ఇప్పుడు ఎక్కడ చూసినా అవే వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఇక వివాహం సమయంలో వధువులు చేసిన చిలిపి పనులు ఇంటర్నెట్ జెట్ స్పీడ్‌తో ట్రెండ్ అవుతుంటాయి. పెళ్లి అంటే వధూవరులపై ఫోకస్ ఉంటుంది. అందులోనూ వీడియోగ్రాఫర్ లేదా ఫోటోగ్రాఫర్ వారి మూమెంట్‌ను ఫాలో అవుతుంటారు. అందుకే వధూవరుల వీడియోలు ఎక్కువ వైరల్ అవుతాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. మరికొన్ని వీడియోలు ‘సో క్యూట్’  అనిపిస్తాయి.  తాజాగా ఓ కొంటె వధువు వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఆ వీడియోని చూస్తే మీ ముఖంలో కూడా చిరునవ్వు వస్తుంది.  ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో, వధువు కెమెరా వైపు చూస్తూ తన నాలుకతో ఆటపట్టిస్తోంది. పెళ్లి మండపానికి వస్తున్న సమయంలో ఆమె ఇలా చేసింది. ఈ వీడియో ఇన్‌స్టాలో witty_wedding అనే పేరుతో షేర్ చేయబడింది. అప్‌లోడ్ చేసిన 7 గంటల్లోనే 1965 మందికి పైగా దీన్ని లైక్ చేసారు. ఆ వధువు చాలా అందంగా ఉందని, పెళ్లి కుమార్తె వివాహా వేడుకను ఆస్వాదిస్తుందని పలవురు కామెంట్లు పెడుతున్నారు. పెళ్లి అంటే లైఫ్‌లో బెస్ట్ మూమెంట్. ఆ సమయాన్ని ఆమె పూర్తిగా ఎంజాయ్ చేస్తుందని మరో యూజర్ రాసుకొచ్చారు.

వీడియో దిగువన చూడండి