సినిమాలు, రాజకీయాలు, ఎంటర్టైన్మెంట్.. ఇలా అన్నింటికీ సోషల్ మీడియా కేరాఫ్ అడ్రస్. పాజిటివ్ వార్తలకైనా, ఏదైనా విషయాన్ని వైరల్ చేయలన్నా నెటిజన్లు సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్.. ఇలా సోషల్ మీడియా హ్యాండిల్ ఏదైనా కూడా ఇప్పుడు అందరినీ కనెక్ట్ చేస్తూ వస్తోంది.
ఇదిలా ఉంటే కొందరు ఇంటర్నెట్‌లో పాపులర్ కావడానికి తిక్క వేషాలు, వెకిలి పనులు చేస్తుంటారు. స్టార్ డమ్ కోసం తమ ప్రాణాలను సైతం రిస్క్‌లో పడేస్తారు. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అదే చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
వైరల్ వీడియో ప్రకారం.. కొంతమంది ఓ మొసలిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఇక దానితో ఫోటోలు, వీడియోలు దిగడం మొదలు పెట్టారు. అసలే క్రూర జంతువు.. ఆపై ఆటలు.. ఇంకేమైనా ఉందా.! ప్రాణాలతో చెలగాటమే.. ఇక వారు ఊహించని విధంగా మొసలి గట్టి షాక్ ఇచ్చింది. చివర్లో మెరుపు దాడికి దిగింది. దీనితో మొత్తం అందరూ కూడా భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి లైకులు, కామెంట్స్‌లతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.!