Viral Video: సుందరానికి తొందరెక్కువ అన్నట్లు.. ఈ మొసలి కూడా తెగ ఆరటపడిపోతోంది.. దేనికోసమో మీరే చూసేయండి..

Viral Video: వైల్డ్ లైఫ్ భలే విచిత్రంగా ఉంటుంది. అడవి జంతువుల జీవితం విలక్షణంగా ఉంటుంది. బలమున్న జీవిదే అక్కడ రాజ్యం. అందుకే సింహాన్ని అడవికి రాజు అంటారు.

Viral Video: సుందరానికి తొందరెక్కువ అన్నట్లు.. ఈ మొసలి కూడా తెగ ఆరటపడిపోతోంది.. దేనికోసమో మీరే చూసేయండి..
Crocodile

Updated on: Feb 24, 2022 | 7:31 PM

Viral Video: వైల్డ్ లైఫ్ భలే విచిత్రంగా ఉంటుంది. అడవి జంతువుల జీవితం విలక్షణంగా ఉంటుంది. బలమున్న జీవిదే అక్కడ రాజ్యం. అందుకే సింహాన్ని అడవికి రాజు అంటారు. అయితే, భూమిపై సింహాదానికి రాజసం అయితే.. నీటిలో మాత్రం మొసలిది అని చెప్పవచ్చు. మొసలికి నీటిలో ఉన్నప్పుడు ఉండే బలం.. బయటకు వచ్చేసరికి తగ్గిపోతుందంటారు. నిజమే కాబోలు.. నీటి నుంచి బయటకు వచ్చిన మొసలి తెగ ఆరాటపడిపోతూ మళ్లీలో నీళ్లలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మొసలి పడుతున్న ఆరాటం చూసి నెటిజన్లు దానిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘సుందరానికి తొందరెక్కువ అన్నట్లుంది దీని పరిస్థితి’ అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో మొసలి ఏం చేసింది? అంత ఆరాటం ఎందుకోసమో ఇప్పుడు తెలుసుకుందాం. వైరల్ అవుతున్న వీడియోలో ఓ నీటి ప్రవాహం మధ్యలో రోడ్డు మార్గం ఉంది. అవతలి వైపున చెక్ డ్యామ్ ఉండగా.. మరోవైపున లోయ మాదిరిగా ఉంది. అయితే, ఆ చెక్ డ్యామ్ నుంచి బయటకు వచ్చిన మొసలి.. రోడ్డు దాటి లోయలోకి వెళ్లింది. మళ్లీ ఏమైందో ఏమో.. అయోమయంగా వెనుదిరిగింది. ఏదో భయపడుతున్నట్లు.. ఆరాటపడుతూ పరుగెత్తి నీటిలోకి వచ్చేసింది. భయపడుతున్నట్లుగా, దేనికోసమో ఆరాటపడుతున్నట్లుగా మొసలి పరుగెత్తి చెక్‌ డ్యామ్‌లోకి దూకేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు మొసలి తీరును చూసి నవ్వుకుంటున్నారు. దాని తీరుపై ఫన్నీ కామెంట్స్ వేస్తున్నారు.

Also read:

Russia – Ukraine War: గర్జిస్తున్న రష్యా.. నిలువెల్లా వణికిపోతోన్న ఉక్రెయిన్.. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే..

Russia’s invasion of Ukraine: మరో నియంతగా మారుతున్న వ్లాదిమిర్ పుతిన్.. ఒళ్లు గగుర్పొడిచేలా అతని చర్యలు..!

Viral News: నాడు చీరకట్టులో.. నేడు వెస్ట్రన్ డ్రెస్‌లో.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యూపీ మహిళా అధికారి..!