Viral: వంట గది మరమ్మతులు చేస్తుండగా బయటపడ్డ కుండ.. ఓపెన్ చేయగా.. కళ్లు చెదిరేలా..

|

Apr 27, 2024 | 7:12 AM

ఏదైనా నిధి దొరికితే బాగుండు నాకున్న అన్ని కష్టాలన్నీ తొలగిపోతాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఓ జంట మాత్రం అలా అనుకోకుండానే వారికి నిధి దొరికింది. కానీ దానికోసం వారు ఎక్కడెక్కడో తవ్వకాలు జరపలేదండోయ్.. వారి పాత ఇంట్లో వంట గది పాడయిందని రినోవేషన్ చేయిస్తుంటే చిన్న పాటి డబ్బా బయట పడింది. అందులో...

Viral: వంట గది మరమ్మతులు చేస్తుండగా బయటపడ్డ కుండ.. ఓపెన్ చేయగా.. కళ్లు చెదిరేలా..
Kitchen
Image Credit source: Becky Fooks
Follow us on

అదృష్టం అంటే ఇది కదా. సుడి తిరగడం అంటే ఇది కదా. ఇంట్లోని వంట గది రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న ఓ కపుల్ సుడి తిరిగిపోయింది.  కీచెన్ రీ మోడలింగ్ కోసం తవ్వకాలు జరిపిన వారికి విలువైన 17వ శతాబ్దకాలం నాటి అరుదైన పురాతన వెండి, బంగారు కాయిన్స్ దొరికాయి. రాబర్ట్, బెట్టీ ఫూక్స్ అనే కపుల్ దక్షిణ ఇంగ్లాండ్‌లోని వెస్ట్ డోర్సెట్‌లో 17వ శతాబ్ధానికి చెందిన ఓ పురాతన కాటేజ్ సౌత్ పోర్టన్ ఫార్మ్ 2019లో కొనుగోలు చేశారు. అయితే వారు తమ అభిరుచికి అనుకూలంగా వంట గదిని రీ కన్‌స్ట్రక్షన్ చేయాలనుకున్నారు. తమ కిచెన్‌లోని కాంక్రీట్ ఫ్లోర్‌ను తొలగించి ఎత్తైన పైకప్పును నిర్మించాలనుకున్నారు. దీనికోసం వంటగదిలో కాంక్రీట్ ఫ్లోర్‌ను బద్దలు కొట్టారు. అందులో రాజుల కాలం నాటి 1000 నాణేలు బయటపడ్డాయి.

400 ఏళ్ల క్రితం నాటి కింగ్ జేమ్స్ I, కింగ్ చార్లెస్ I లకు చెందిన 1029 అరుదైన కాయిన్స్ వారికి ఒక పింగానీ కుండలో లభించాయి. బ్రిటిష్ మ్యూజియం ఈ నాణేలు 1642, 1644 మధ్యకాలం నాటివని ఐడెంటిఫై చేసింది. వాటిలో కొన్ని ఎలిజబెత్ I వెండి షిల్లింగ్స్, క్వీన్ మేరీ I కాలం నాటి కాయిన్స్ కూడా ఉన్నాయి. తాజాగా ఏప్రిల్ 23న ఈ కాయిన్స్ వేలం వేశారు. పూర్వ కాలానికి చెందిన ఈ సంపదను చేజిక్కిచ్చుకునేందుకు ప్రపంచంలోని చాలామంది ఔత్సాహికులు పోటీ పడ్డారు. డోర్చెస్టర్‌లోని డ్యూక్స్ వేలంలో నాణేలకు అదిరిపోయే ధర పలికింది. అక్షరాల రూ.62.88 లక్షలు వారు సొంతం చేసుకున్నారు. ఈ డబ్బు తమ లోన్‌ చెల్లించడంలో సహాయపడుతుందని ఫూక్స్ దంపతులు చెప్పారు.

అక్టోబరు 2019లో ఈ నిధిని కనుగొన్నారు. కాగా నిపుణుల విశ్లేషణ,  లీగర్ ప్రొసీజర్ పూర్తయిన తర్వాత ఈ సంవత్సరం జంటకు తిరిగి ఇచ్చారు.  బ్రిటిష్ మ్యూజియం వాటిని ఇంగ్లీష్ సివిల్ వార్ (1642-51) ప్రారంభంలో ఒక భూస్వామి తన సంపదను సురక్షితంగా ఉంచడానికి వాటిని ఈ రకంగా దాచి ఉండవచ్చని అభిప్రాయపడింది. (Source)

Coins

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..