Viral Video: ఛీ.. ఛీ.. నడిరోడ్డుపై రెచ్చిపోయిన లవర్స్.. బైక్‌పై స్పీడుగా వెళ్తూ రొమాన్స్.. చివరకు..

ప్రేమ హద్దు మీరుతోందా? అంటే ఈ మధ్య జరుగుతున్నకొన్ని ఘటనలను చూస్తే అవుననే చెప్పాలి. ఇటీవల కాలంలో ప్రేమజంటలు హద్దుమీరుతున్నాయి. బహిరంగంగా రోడెక్కుతూ రచ్చచేస్తున్నాయి. నడిరోడ్డుపై బైక్ రైడింగ్‌లో రొమాన్స్ చేస్తూ విమర్శల పాలవుతున్నాయి. మొన్న బెంగళూరులో.. తాజాగా రాజస్థాన్‌లో మరో జంట రొడ్డెక్కి రచ్చచేసింది.

Viral Video: ఛీ.. ఛీ.. నడిరోడ్డుపై రెచ్చిపోయిన లవర్స్.. బైక్‌పై స్పీడుగా వెళ్తూ రొమాన్స్.. చివరకు..
Viral Video
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Shaik Madar Saheb

Updated on: May 24, 2024 | 7:40 AM

ప్రేమ హద్దు మీరుతోందా? అంటే ఈ మధ్య జరుగుతున్నకొన్ని ఘటనలను చూస్తే అవుననే చెప్పాలి. ఇటీవల కాలంలో ప్రేమజంటలు హద్దుమీరుతున్నాయి. బహిరంగంగా రోడెక్కుతూ రచ్చచేస్తున్నాయి. నడిరోడ్డుపై బైక్ రైడింగ్‌లో రొమాన్స్ చేస్తూ విమర్శల పాలవుతున్నాయి. మొన్న బెంగళూరులో.. తాజాగా రాజస్థాన్‌లో మరో జంట రొడ్డెక్కి రచ్చచేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. ఇందులో కనిపించే జంట చేసిన వెకిలి చేష్టలు చూశాకా.. వీళ్లను ఏమనాలో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నడిరోడ్డుపై బైక్‌ నడుపుతూ హద్దులు మీరి రొమాన్స్‌ చేస్తూ వీళ్లు చేసిన న్యూసెన్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. గర్ల్ ఫ్రెండ్‌కు థ్రిల్ ఇవ్వాలనే లక్ష్యంతో కొంతమంది ఇలా సాహసాలు చేస్తున్నారు. అదేదో ఫ్యాషన్, ట్రెండ్ అన్నట్లుగా బైక్ ముందు భాగంలో అమ్మాయిని రివర్స్‌లో కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేస్తూ రొమాన్స్‌ చేస్తున్నారు. పిచ్చి చేష్టలతో వార్తల్లోకెక్కుతున్నారు. ప్రాణాల మీదుకు తెచ్చుకొని విమర్శల పాలవుతున్నారు.

వీడియో చూడండి..

రాజస్థాన్‌లో ఈ జంట రాత్రి సమయంలో నడి రోడ్డుపై బైక్ మీద స్పీడ్‌గా వెళ్లడమే కాకుండా రొమాన్స్ చేస్తూ స్టంట్ చేశారు. అదే టైంలో రోడ్డుపై వెళ్తున్న మరికొందరు వీడియో తీస్తున్నా సోయిలేకుండా ఇంకా రెచ్చిపోయి పోజులిచ్చారు. చివరకు వీడియో వైరల్‌ కావడం.. లవర్స్ ప్రవర్తనపై నెటిజన్లు ఫైర్ కావడం చకచకా జరిపోయాయి. జంటపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్‌ పోలీసులను ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశారు. ప్రేమ జంటను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిచేత క్షమాపలు చెప్పించి.. కేసు ఫైల్ చేశారు.

క్షమాపణలు చెబుతున్న వీడియో చూడండి..

రాజస్థాన్ కోటలోని NH-52లో ఈ ఘటన జరిగింది. బండి రోడ్డులోని హెర్బల్ గార్డెన్ సమీపంలో ఈ జంట ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు వీడియో ఫుటేజీలో ఉందని తెలిపారు కోటా అదనపు పోలీసు సూపరింటెండెంట్ దిలీప్ సైనీ. ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని కైతూన్ గ్రామానికి చెందిన వసీమ్‌గా గుర్తించారు. అనంతరం.. మరో వీడియోలో తాము చేసింది తప్పు అని అంగికరించి మమ్మల్ని క్షమించండంటూ లవర్స్ వేడుకుంటున్న వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారడంతో… పోలీసులు మంచిపని చేశారంటూ.. ఆ జంటను విమర్శిస్తూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..